Donot namaz in public places : బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదు : స్పష్టం చేసిన సీఎం

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని ఇతరులను ఇబ్బంది పెట్టి ప్రార్థనలు చేయటం సరికాదని హర్యానా సీఎం స్పష్టం చేసారు.

Donot namaz in public places : బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదు : స్పష్టం చేసిన సీఎం

Donot Namaz In Public Places

Updated On : December 11, 2021 / 12:11 PM IST

Offering namaz in open spaces won’t be tolerated : ‘గురుగావ్ లో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదు’ అని హర్యానీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టంచేశారు. ప్రార్థనలు చేసుకునే హక్కు అందరికి ఉంటుంది..కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడని.. రోడ్డు ట్రాఫిక్ ను అడ్డుకునేలా ప్రార్థనలు ఉండకూడదని సూచించారు. నిర్ధేశించిన ప్రదేశాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని స్పష్టంచేశారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. కాగా ముస్లింలు ప్రతీ శుక్రవారం మసీదుకు వెళ్లి నమాజ్ లు చేసుకుంటుంటారనే విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా గురుగ్రామ్ లో శుక్రవారం రోజు ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో అంటే రోడ్లపై బారులు తీరి నమాజులు చేసుకోవటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆయా రోడ్లలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో హిందూ, ముస్లిం వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇది గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీకి తలనొప్పిగా మారింది. దీంతో ముస్లిం పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా అదే కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాలలో ముస్లింలు మళ్లీ ప్రార్థనలు చేస్తున్న తరుణంలో హిందూ సమాజంలోని ఒక వర్గం వారితో ఘర్షణకు దిగుతోంది. ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది.

Read more :  Gurugram Namaz: నగరమంతా 18చోట్ల జుమా నమాజ్ నిర్వహించేందుకు నిర్ణయం

దీంతో సీఎం మనోహరర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతు..ఒకరిని ఇబ్బంది కలిగేలా ప్రార్థనలు చేసుకోవటం సరికాదని సూచించారు. 2018లో జరిగిన ఒప్పందం మేరకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని తెలిపారు. అన్ని పక్షాలతో మళ్లీ చర్చలు జరుపుతామని.. సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామని ఖట్టర్ తెలిపారు. అప్పటి వరకు ప్రజలంతా తమతమ ఇళ్లలో లేదా నిర్దేశిత ప్రార్థనా స్థలాల్లోనే ప్రార్థనలు చేయాలని సీఎం ముస్లిం సోదరులను కోరారు. ప్రార్థనా స్థలాల్లో ప్రార్థనలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని… ప్రార్థనల కోసమే ఆ స్థలాలను నిర్మించారని ఖట్టర్ చెప్పారు. అయితే బహిరంగంగా ఆ పనులు చేయకూడదని… బహిరంగంగా నమాజ్ చేసే ఆచారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పోలీసు అధికారులతో మాట్లాడానని చెప్పారు.

Read more : DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేసే హక్కు ఉంటుందని..కొందరు నమాజ్ చేస్తారు, మరికొందరు పూజలు చేస్తారు. అది వారి వారి ఇష్టం.వారి వారి ఆచారం. ఎవ్వరికి నమ్మకాలైనా..ఆచారాలు అయినా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు అని ఖట్టర్ తెలిపారు. కాబట్టి ముస్లింలు ప్రార్థనలు రోడ్డు ట్రాఫిక్ ను అడ్డుకునేలా ఉండకూడదని..ఇకనుంచి బహిరంగంగా నమాజ్ చేసే ఈ పద్ధతిని సహించేది లేదు అని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమణల్లో ఉన్న వక్ఫ్ భూములను, స్థలాలను ఉచితంగా అందించేందుకు మర్గదర్శకాలను రూపొందిస్తున్నామని ఖట్టర్ తెలిపారు.

కాగా గత కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్ లోని బహిరంగ ప్రదేశాల్లో మొత్తం 18చోట్ల శుక్రవారం నమాజు నిర్వహించేందుకు ముస్లిం నేషనల్ ఫోరం అనుమతులు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ను కలిసి మెమొరాండం సమర్పించింది. 12మసీదులు, మదరసా, వక్ఫ్ బోర్డ్ మరో ప్లేసులను తాత్కాలికంగా తీసుకుని నిర్వహణ ఏర్పాట్లు మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఏదైనా ఆటంకం తలపెడితే వారిని ముస్లిం నేషనల్ ఫోరం, ఇమామ్ ఆర్గనైజేషన్ డీల్ చేస్తుందని వారు చెప్పారు. డిప్యూటీ కమిషనర్ కు సమర్పించిన మెమొరాండంలో గురుగ్రాంలో శాంతిభద్రతలకే ప్రాధాన్యం ఇస్తామని.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరిన విషయం తెలిసిందే. ఈక్రమంలో సీఎం ఖట్టర్ బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయొద్దని స్పష్టంచేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read more :Omicron Covid Variant : మహారాష్ట్రలో ఒమిక్రాన్ అలర్ట్.. భారత్‌లో పెరుగుతున్న కేసులు..!

కాగా.. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ లకు వ్యతిరేకంగా హిందువులు గురుగ్రామ్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉన్నారు. డిసెంబర్ 3న శుక్రవారం నమాజ్ చేయడానికి గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని పబ్లిక్ గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారు. దీంతో స్థానిక నివాసితులు, వివిధ హిందూ సంస్థల సభ్యులు మరోసారి నిరసనను ప్రారంభించవలసి వచ్చింది.

శుక్రవారం నమాజ్ చేయడానికి పబ్లిక్ గ్రౌండ్‌కు చేరుకున్న ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ‘జై శ్రీరామ్’ మరియు ‘వందే మాత్రం’ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గురుగ్రామ్ పోలీసులు, ముస్లింలను బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని ఆపడానికి బదులుగా హిందువులను అక్కడి నుండి నెట్టివేశారు. ముస్లింలు నమాజ్‌ను అడ్డుకోకుండా నిరసనకారులను దూరంగా ఉంచడానికి పోలీసులు ప్రయత్నించారు.

Offering namaz in open spaces won’t be tolerated: Haryana CM Khattar

Offering Namaz In Open Spaces will not Be Tolerated says Haryana Chief Minister