Gurugram Namaz: నగరమంతా 18చోట్ల జుమా నమాజ్ నిర్వహించేందుకు నిర్ణయం

గురుగ్రామ్ లోని బహిరంగ ప్రదేశాల్లో మొత్తం 18చోట్ల శుక్రవారం నమాజు నిర్వహించేందుకు ముస్లిం నేషనల్ ఫోరం అనుమతులు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ను కలిసి..............

Gurugram Namaz: నగరమంతా 18చోట్ల జుమా నమాజ్ నిర్వహించేందుకు నిర్ణయం

Namaz

Updated On : December 7, 2021 / 9:19 AM IST

Gurugram Namaz: గురుగ్రామ్ లోని బహిరంగ ప్రదేశాల్లో మొత్తం 18చోట్ల శుక్రవారం నమాజు నిర్వహించేందుకు ముస్లిం నేషనల్ ఫోరం అనుమతులు తీసుకుంది. ఈ మేరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ను కలిసి మెమొరాండం సమర్పించింది. 12మసీదులు, మదరసా, వక్ఫ్ బోర్డ్ మరో ప్లేసులను తాత్కాలికంగా తీసుకుని నిర్వహణ ఏర్పాట్లు మొదలుపెట్టాలని చూస్తున్నారు.

ఏదైనా ఆటంకం తలపెడితే వారిని ముస్లిం నేషనల్ ఫోరం, ఇమామ్ ఆర్గనైజేషన్ డీల్ చేస్తుందని వారు చెప్పారు. డిప్యూటీ కమిషనర్ కు సమర్పించిన మెమొరాండంలో గురుగ్రాంలో శాంతిభద్రతలకే ప్రాధాన్యం ఇస్తామని.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు.

‘ముందుగా అనుకున్నట్లు 20బహిరంగ ప్రదేశాల్లో నమాజులు నిర్వహించాలనుకోవడం లేదు. కేవలం తాత్కాలికంగా 6ప్రదేశాలు ఇవ్వగలిగితే చాలు. దీని కోసం ఆర్గనైజేషన్ సంబంధిత అధికారులకు మెమొరాండం అందజేస్తుంది’ అని ఇమామ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.

………………………………… : చలానాలు కట్టే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు.. బైక్ వదిలి పరార్