Gas Cylinder : భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563కు పెరిగింది. విశాఖలో రూ.2413, విజయవాడలో రూ.2501 కు చేరాయి. ఢిల్లీలో రూ.2355కు చేరింది.

Gas Cylinder : భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Commercial Cylinder

Updated On : May 1, 2022 / 12:40 PM IST

commercial gas cylinder : ఆయిల్ కంపెనీలు మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. దేశవ్యాప్తంగా మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ పై రూ.104 పెందాయి. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563కు పెరిగింది. విశాఖలో రూ.2413, విజయవాడలో రూ.2501 కు చేరాయి. ఢిల్లీలో రూ.2355కు చేరింది.

అయితే 14 కిలోల ఎల్ పీజీ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం హైదరాబాద్ లో డొమెస్టెక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1002 గా ఉంది. ప్రతి నెల 1వ తేదీన దేశవ్యాప్తంగా ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుండగా తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

దేశంలో ఇప్పటికే నిత్యవసర వస్తువులు, పెట్రో ధరల పెంపు ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజలపై మరింత భారం పడనుంది.