భలే మంచి చౌక బేరం : రూ.1కే కేజీ చేపలు

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 06:12 AM IST
భలే మంచి చౌక బేరం : రూ.1కే కేజీ చేపలు

Updated On : November 11, 2019 / 6:12 AM IST

ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతుంటారు జనం. ఆఫర్ అనే మాట వినిపిస్తే చాలు ఎంత దూరం అయినా సరే వెళ్లి షాపింగ్ చేస్తారు. ప్రజల నాడి తెలుసుకున్న వ్యాపారులు కూడా ఆఫర్లను ప్రకటిస్తూ కష్టమర్లను ఆకట్టుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిలో చేపలు కేవలం ఒకే ఒక్క రూపాయి అంటే తన బిజినెస్ ను మూడు చేపలు..ఆరు రూపాయలుగా అమ్మేసుకుంటున్నాడు. అదేంటి కేజీ చేపలు ఒకే ఒక్క రూపాయికి అమ్మితే లాభం ఏంటి నష్టం వస్తుందిగానీ అనుకోవచ్చు..అక్కడే సదరు వ్యాపారి తన తెలివితేటల్ని చూపించాడు. 

శివగంగ జిల్లా కరైకుడిలోని బర్మా కాలనీలో మనోహర్ అనే వ్యాపారి కొత్తగా చేపల వ్యాపారం ప్రారంభించాడు. ఆఫర్ కింద కేవలం ఒక్క రూపాయికే కేజీ చేపలు అంటూ ప్రకటించేశాడు. తన దగ్గర చేపలు కొన్న మొదటి వంద మందికి మాత్రమే కేవలం రూపాయికి కిలో చేపల అమ్ముతానంటూ కండిషన్ పెట్టి ప్రచారం చేశారు.

దీంతో మనోహర్ షాప్  దగ్గర క్యూ కట్టేశారు జనం.ఉదయం ఆరు గంటలకే షాపు ముందు భారీగా  బారులు తీరారు. తొలి వంద మందికే కేజీకి రూపాయి వసూలు చేసిన వ్యాపారి మనోహర్… ఆ తర్వాత వచ్చిన వారికి మాత్రం బాగానే రేటు పెంచేశాడు. అంతేకాదు.. తన దగ్గర చేపలు కొనటానికి వచ్చినవారికి చేపలు ఆరోగ్యానికిం చాలా మేలు చేస్తాయని ముఖ్యంగా చిన్నపిల్లలకు చేపలు తినటం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చెబుతున్నాడు. దీంతో రేటు ఎక్కువైనా చేపలు కొనటానికి ఆసక్తి చూపించారు జనం. సాధారణంగా చేపలు అమ్మేవారు తమ వ్యాపారం చూసుకుంటారు తప్ప చేపలు తినటంవల్ల కలిగే ఉపయోగాలు గురించి చెప్పరు. మనోహన్ తన వ్యాపారం డెవలప్ కోసం ఈ టెక్నిక్ ను కూడా యూజ్ చేశాడు. దీంతో చక్కటి స్పందన వచ్చింది. 
దీంతో ప్రచారానికి పబ్లిసిటీకి పబ్లిసిటీ..డబ్బులకు డబ్బులు వచ్చాయి. మనోహర్ గల్లా పెట్టె చక్కగా నిండింది. శతకోటి లింగాల్లో ఓ బోడి లింగంగా ఉండే కంటే కొత్త పెట్టిన వ్యాపారానికి ఓ పబ్లిసిటీ కావాలి కదా మరి. వ్యాపారమంటే  మాటలా..లౌక్యంతో పాటు ఆలోచనల్లో  క్రియేటివిటీ కూడా కావాలి. తన క్రియేటివిటీతో మనోహన్ 520 కిలోల చేపల్ని అమ్మేశాడు. 

ఈ చేపల వ్యాపారం టెక్నిక్ గురించి వ్యాపారి మనోహర్ మాట్లాడుతూ..చేపలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదనీ..ఆ విషయం తెలియజేసేందుకే చేపల్ని అమ్మేందుకు ఈ టెక్నిక్ ను ఉపయోగించుకున్నాననీ అంటున్నాడు. తన వ్యాపారం చక్కగా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు చేపలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారంటున్నాడు.