Gujarat : ఒకే ఒక్క‌డు.. 141 మంది ప‌రీక్ష రాస్తే ఒక్క‌డే పాస్‌.. ఇదేం చిత్ర‌మో..?

త‌ర‌చూ వివాదాల్లో ఉండే సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ(వీఎన్‌ఎస్‌జీయూ) మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

Gujarat : ఒకే ఒక్క‌డు.. 141 మంది ప‌రీక్ష రాస్తే ఒక్క‌డే పాస్‌.. ఇదేం చిత్ర‌మో..?

Only 1 Out of 141 Students Pass MA Exam in Surat's VNSG University

త‌ర‌చూ వివాదాల్లో ఉండే సూరత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ(వీఎన్‌ఎస్‌జీయూ) మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ (MA ఎకనామిక్స్) ఎక్స్‌ట‌ర్న‌ల్ ప‌రీక్ష ఫ‌లితాలే అందుకు కార‌ణం. ఈ పరీక్షకు 141 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. కేవ‌లం ఒక్క‌విద్యార్థే పాస్ అయ్యాడు. మిగిలిన 140 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫ‌లితాలు చూసుకున్న త‌రువాత విద్యార్థులు షాక్ అయ్యారు.

ఇంత మంది విద్యార్థులు ఒకేసారి ఫెయిల్ కావ‌డం అనేది అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తింది. ప్ర‌శ్నాప‌త్రం చాలా క‌ఠినంగా ఉందా..? మూల్యాంకన ప్రక్రియలో లోపాలు ఉన్నాయా..? ఏదైన అక్ర‌మం జ‌రిగిందా? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యించాయి. వీటి అన్నింటికి విశ్వ‌విద్యాల‌యం స‌మాధానం ఇవ్వాల్సి ఉంది.

అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. 192 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు. వీరిలో 51 మంది గైర్హాజరయ్యారు. 141 మంది ప‌రీక్ష రాశారు. వీరిలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉత్తీర్ణత సాధించాడు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త శాతం 0.71గా ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ రమేష్ గాధ్వికి ఫిర్యాదు చేశారు.

కాగా.. విద్యార్థుల ఫిర్యాదును స్వీక‌రించిన‌ట్లుగా రిజిస్ట్రార్ తెలిపారు. మిగిలిన బాధిత విద్యార్థులు కూడా ముందుకు రావాల‌ని కోరారు. ఇంత మంది ఒకే సారి ఫెయిల్ కావ‌డానికి గ‌ల కారణాలపై యూనివర్సిటీ విచారణ జరుపుతోందన్నారు.

దగ్గు సిరప్ బాటిల్‌ను మింగిన పాము.. వీడియో వైరల్

ఇదిలా ఉంటే.. డిసెంబర్ 2023లో BA-BCom విద్యార్థుల్లో కొంద‌రు ప‌రీక్షా స‌మాధాన పత్రాల్లో అస‌భ్య‌క‌ర‌మైన బాష‌తో స‌హా అనుచిత‌మైన కంటెంట్‌ను వ్రాశారు. ఇలా రాసిన ఆరుగురు విద్యార్థుల‌ను గుర్తించి వారికి జ‌రిమానా వేయ‌డంతో పాటు ఆయా ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ చేశారు. ప్ర‌స్తుతం ఒక్క విద్యార్థే పాస్ కావ‌డంతో మ‌రోసారి ఈ విశ్వ‌విద్యాల‌యం పేరు వార్త‌ల్లోకి వ‌చ్చింది.