బీహార్‌లో వ‌రుస‌గా కూలిపోతున్న బ్రిడ్జ్‌లు.. కార‌ణ‌మేంటో చెప్పిన కేంద్ర మంత్రి!

బిహార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బ్రిడ్జిలు వరుసగా కూలిపోతున్నాయి. గడిచిన 17రోజుల వ్యవధిలో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి.

బీహార్‌లో వ‌రుస‌గా కూలిపోతున్న బ్రిడ్జ్‌లు.. కార‌ణ‌మేంటో చెప్పిన కేంద్ర మంత్రి!

Bihar bridge collapse

Bihar bridge collapse : బిహార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బ్రిడ్జిలు వరుసగా కూలిపోతున్నాయి. గడిచిన 17రోజుల వ్యవధిలో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. దీంతో అసలు బీహార్ లో ఏం జరుగుతుంది.. బ్రిడ్జిలు ఉన్నట్లుండి ఎందుకు కూలిపోతున్నాయనే అంశంపై బీహార్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారీ వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిలు స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలుతుండటం పలు అనుమానాలకు తావునిస్తోంది. అయితే, వరుసగా బ్రిడ్జిలు కూలుతుండటంపై కాంట్రాక్టర్లు, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణ సమయంలో అధికారుల సరియైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే కాంట్రాక్టర్ల అరకొర పనులతో ఈ బ్రిడ్జి నిర్మాణాలు కూలిపోతున్నాయని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read : బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..!

గడిచిన పదిహేడు రోజుల్లో అనేక ప్రాంతాల్లో బ్రిడ్జిలు కూలాయి. శివన్, సరన్, మధుబాణి, ఆరారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణగంజ్ జిల్లాల్లో బ్రిడ్జిలు కూలిపోయాయి. మరోవైపు వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోనేకాక, దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో సీఎం నితీశ్ కుమార్ అప్రమత్తయ్యారు. బ్రిడ్జిలు కూలడానికి కారణాలపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : పార పట్టిన కలెక్టర్.. మాటలు కాదు.. చేసి చూపించాలంటూ క్లాస్..

భారీ వ్యయంతో నిర్మించిన వంతెనలుసైతం స్వల్ప కాలంలోనే కూలిపోవడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ సమయంలో తాజా ఘటనలపై.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించారు. బ్రిడ్జిలు ఎందుకు కూలిపోతున్నాయో చెప్పారు. ప్రస్తుతం రుతుపవనాల సమయం. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణం చేతనే బ్రిడ్జిలు కూలిపోతున్నాయని అన్నారు. ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సీరియస్ గా ఉన్నారు.. వెంటనే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారంటూ కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. వర్షాలకే బ్రిడ్జిలు కూలిపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు.