దగ్గు సిరప్ బాటిల్‌ను మింగిన పాము.. వీడియో వైరల్

పాము నోటిలో దగ్గు సిరప్ బాటిల్ ఇరుక్కోవడం వీడియోలో చూడొచ్చు.

దగ్గు సిరప్ బాటిల్‌ను మింగిన పాము.. వీడియో వైరల్

దగ్గు సిరప్ బాటిల్‌ను మింగేసింది ఓ పాము. ఇందుకు సంంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఎక్స్ లో ఈ వీడియోలను పోస్ట్ చేశారు. భువనేశ్వర్‌లో ఈ ఘటన జరిగిందని అన్నారు.

పాము నోటిలో దగ్గు సిరప్ బాటిల్ ఇరుక్కోవడం వీడియోలో చూడొచ్చు. ఈ విషయంపై సమాచారం అందుకున్న హెల్ప్‌లైన్ వాలంటీర్లు వెంటనే ఆ పాముని రక్షించడానికి వచ్చారని సుశాంత నంద అన్నారు. నోట్లో సిరప్ బాటిల్ ఇరుక్కుపోవడంతో ఈ నాగుపాము ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిపోయినట్లు వాలంటీర్లు గుర్తించారు.

పాము కింది దవడ భాగాన్ని కదిలించడంతో చివరకు ఆ బాటిల్ బయటపడింది. పాము ప్రాణాన్ని వాలంటీర్లు కాపాడారని సుశాంత నంద చెప్పారు. పాముని కాపాడిన వాలంటీర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పాములను పట్టి తీసుకెళ్లాలన్నా, వాటిని రక్షించాలన్న హెల్ప్‌లైన్ వాలంటీర్లు బాగా సాయపడుతున్నారు.


Also Read: కాంగ్రెస్‌లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చేర్చుకోవద్దంటూ సెల్ టవర్ ఎక్కిన కార్యకర్త