భారత్‌లో డేంజర్ బెల్స్.. ప్రాణాలు తీస్తున్న కాలుష్యం, ఏటా 33వేల మంది మృతి..!

కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.

భారత్‌లో డేంజర్ బెల్స్.. ప్రాణాలు తీస్తున్న కాలుష్యం, ఏటా 33వేల మంది మృతి..!

Air Pollution In India : దేశంలో వాయు కాలుష్యం బారిన పడి ఏటా వేల మంది ప్రణాలు కోల్పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా 12వేల మంది వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా జరిపిన ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా దేశ రాజధానితో పాటు హర్యానా, పంజాబ్, వారణాసి ప్రాంతాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

దేశంలోని 10 నగరాల్లో ఏటా వాయు కాలుష్యంతో దాదాపు 33వేల మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ నివేదిక వెల్లడించింది. స్వచ్ఛమైన వాయువు ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతీ క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రో గ్రాములకన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కాలుష్యం బారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించాలని ఆ నివేదిక సూచించింది. ఢిల్లీలో ప్రతీ ఏడాది 2వేల మంది వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారని నివేదిక తెలిపింది.

కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. భారత్ లోని మొత్తం 10 నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.

సిమ్లాలో అత్యల్పంగా 59మంది వాయు కాలుష్యంతో మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం. మొత్తం 10 నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం.. కాలుష్యం వల్లే అని నివేదిక తెలిపింది. భారత్ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. 10 నగరాల్లో కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని వెల్లడించింది. సంవత్సరంలో 99శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది.

ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే బెంగళూరులో అది 3.06 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వివిధ నగరాల్లో స్వల్ప కాలంలో కాలుష్యం ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్ లో ఇదే తొలిసారి.

Also Read : బీహార్‌లో వ‌రుస‌గా కూలిపోతున్న బ్రిడ్జ్‌లు.. కార‌ణ‌మేంటో చెప్పిన కేంద్ర మంత్రి!