Bhatti Vikramarka : కమిటీలతో విభజన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక అంశాల పరిష్కార మార్గానికి విధాన పరమైన రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. సీఎస్‌ల నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేయనున్నట్టు తెలిపారు.

Bhatti Vikramarka : కమిటీలతో విభజన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం : భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka Says Telugu States To be Solved bifurcation issues ( Image Source : Google )

Updated On : July 6, 2024 / 11:21 PM IST

Bhatti Vikramarka : కమిటీలతో విభజన సమస్యలకు సత్వరమే పరిష్కారించేలా నిర్ణయించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం (జూలై 6) ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలసమావేశం ముగిసిన అనంతరం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి వివరాలను వెల్లడించారు. ఇరురాష్ట్రాల సీఎంల సమావేశంలో అనేక అంశాలపై చర్చించామన్నారు.

Read Also : Gossip Garage : ఎన్నికల తర్వాత ముఖం చాటేసిన వైసీపీ ఇన్‌ఛార్జులు..

గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక అంశాల పరిష్కార మార్గానికి విధాన పరమైన రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. సీఎస్‌ల నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ వేయనున్నట్టు తెలిపారు. ప్రతి రాష్ట్రానికి ముగ్గురు అధికారులతో రెండు వారాల్లో సమావేశం అవుతాయని చెప్పారు. ఇరురాష్ట్రాల మంత్రులతో కూడిన మరో కమిటీ ఉంటుందని తెలిపారు. డ్రగ్ ఫ్రీ, సైబర్ క్రైమ్‌లపై రాష్ట్రంకోసం మా ప్రభుత్వం కట్టుదిట్టంగా ముందుకు వెళుతుందని వీటిపై రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సీఎంల భేటీ కావడం తెలుగు జాతి హర్షించే రోజుగా ఏపీ మంత్రి సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. విభజన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మందుకు రావడం శుభపరిణామంగా పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు.

Read Also : టీటీడీ చైర్మన్‌ పదవిని అశోక్‌ గజపతిరాజు వద్దనుకోవడానికి కారణం అదేనా?