Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లోగో డిజైన్ చేసింది వీళ్లే..

ఆపరేషన్ సిందూర్ లోగో డిజైన్ చేసిన వారి వివరాలను ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్పెషల్ మేగజీన్ ‘బాత్ చీత్’లో వెల్లడించారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లోగో డిజైన్ చేసింది వీళ్లే..

Updated On : May 28, 2025 / 10:41 AM IST

“ఆపరేషన్ సిందూర్”… ఈ పేరుతో పాటు దానికి సంబంధించిన లోగో కూడా సంచలనం సృష్టించింది. పహల్గాంలో 26 మంది భారతీయులను హతమార్చిన పాకిస్తానీ ముష్కరులను మట్టుబెట్టేందుకు ఇండియా చేపట్టిన ఆపరేషన్ కు పెట్టిన పేరు ఇది. ఈ ఆపరేషన్ సిందూర్ లోగోను ఎవరు చేశారనే ఆసక్తి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

దీనికి సంబంధించిన వివరాలను ఆర్మీ బయటపెట్టింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్పెషల్ మేగజీన్ ‘బాత్ చీత్’ లో ఈ ఆపరేషన్ సిందూర్ లోగో డిజైన్ చేసిన వారి వివరాలను వెల్లడించింది. దీన్ని డిజైన్ చేసింది లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్.

Also Read: రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు అప్లై చేసుకున్నారా? మీకు గుడ్‌న్యూస్‌..

ఆర్మీ ప్రచురించిన స్పెషల్ ఎడిషన్ మేగజీన్ 17 పేజీలు ఉంది. అందులో ఫ్రంట్ పేజీలో ఆపరేషన్ సిందూర్ అనేది ఎంతలా ప్రజల మన్ననలు పొందిందో చెప్పడానికి సంబంధించిన డేటాను కూడా ఆర్మీ మేగజీన్ లో పొందు పరిచారు. ఎక్స్ ప్లాట్ ఫాంలో 9 కోట్ల వ్యూస్ రాగా, ఇన్ స్టాలో 51 కోట్ల వ్యూస్ వచ్చినట్టు ఆర్మీ మేగజీన్ లో పేర్కొంది. అలాగే, ఆర్మీ ఎంబ్లమ్ కూడా పొందుపరిచారు.

ఏప్రిల్ 22న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గాంలోకి చొరబడి 26 మంది భారతీయుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. కేవలం మతం ఆధారంగా వారిని పట్టుకొని చంపారు. ఉగ్రవాదుల ఏరివేతకు పెట్టిన పేరే ఆపరేషన్ సిందూర్. మే 7వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటల నుంచి 1.30గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. పాకిస్థాన్ భూ భాగంలోకి వెళ్లి 9 ప్రాంతాల్లో టెర్రరిస్టుల క్యాంపుల మీద ఎటాక్ చేసింది.