రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు అప్లై చేసుకున్నారా? మీకు గుడ్‌న్యూస్‌..

వచ్చే నెల 10 నుంచి 15 వరకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ చేపట్టనున్నారు.

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు అప్లై చేసుకున్నారా? మీకు గుడ్‌న్యూస్‌..

Rajiv yuva vikasam scheme

Updated On : May 28, 2025 / 10:20 AM IST

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు అప్లై చేసుకున్నారా? మీకు గుడ్‌న్యూస్‌.. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ 2లోగా 5 లక్షల మందికి దశల వారీగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. వచ్చే నెల 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలను ఇస్తారు.

వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఈ పథక యూనిట్ల గ్రౌండింగ్‌‌‌‌ ఉంటుంది. వచ్చే నెల 10 నుంచి 15 వరకు ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ చేపట్టనున్నారు. రూ.8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని భట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రతి నెల ఇన్​చార్జ్ మంత్రులు, కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ DAలపై సర్కారు కీలక నిర్ణయం..

పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు బైకుల కొనుగోళ్లకు ఛాన్స్‌ ఇవ్వాలని చెప్పారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ ఛైర్మన్ల వద్దకు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

కాగా, ఈ స్కీమ్‌లో భాగంగా తొలి విడతగా రూ.లక్షలోపు యూనిట్లకు సబ్సిడీ ప్రొసీడింగ్స్‌‌‌‌ ఇస్తారు. అనంతరం దశలవారీగా రూ.4 లక్షల యూనిట్​ వరకు ఇస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రాజీవ్ యువ వికాసంలో చాలా మంది రూ.2 లక్షలు – 4 లక్షల మధ్య విలువైన యూనిట్లకే దరఖాస్తులు చేసుకున్నారు.