Padma Awards 2026: పద్మ అవార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి.. మీ పేరును మీరే ఇలా నామినేట్ చేసుకోండి?
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రతి ఏడాది గణతంత్ర వేడుకల వేళ ప్రకటిస్తారు.

పద్మ అవార్డుల కోసం కేంద్ర సర్కారు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2026 గణతంత్ర వేడుకల వేళ ఈ పద్మ అవార్డులను ప్రకటిస్తారు. వీటి కోసం ఈ ఏడాది జులై 31లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. awards.gov.in లో నామినేషన్లు, సిఫార్సులను సమర్పించవచ్చు.
ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు చేసే వ్యక్తులకు పద్మ అవార్డులు అందిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రతి ఏడాది గణతంత్ర వేడుకల వేళ ప్రకటిస్తారు. 1954 నుంచి వీటిని ప్రకటిస్తున్నారు. నిబంధనల వివరాల కోసం https://padmaawards.gov.in/AboutAwards.aspx చూడొచ్చు.
జాతి, వృత్తి, దేశంలోని ప్రాంతం, లింగంతో సంబంధం లేకుండా అందరూ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న అర్హులు కారు. నామినీ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో నిర్ణీత ఫార్మాట్‌లో అడిగిన పలు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీ పేరును కూడా మీరే నామినేట్ చేసుకోవచ్చు.
ఈ విభాగాల్లో విశిష్ట కృషి చేస్తే దరఖాస్తులు చేసుకోవచ్చు
- కళ, సాహిత్యం, విద్య
- క్రీడలు, వైద్యం
- సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు
- సైన్స్, ఇంజనీరింగ్
- వాణిజ్యం, పరిశ్రమలు
- పౌర సేవ
- భారతీయ సంస్కృతి ప్రచారం
- మానవ హక్కుల పరిరక్షణ
- వన్యప్రాణుల రక్షణ
- ఇతర విభాగాలు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- మొదట రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.in/ తెరవండి
- మీ పేరును రిజిస్టర్ చేసుకోండి
- మీ ఆధార్ ప్రకారం మీ పేరు, పుట్టిన తేది, ఫోన్ నంబర్ పొందుపర్చండి
- మీ నామినేషన్ టైప్‌ను ఎంచుకోండి
- క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది
- దాన్ని ఎంటర్ చేసి, కొత్త నామినేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- నామినీ వివరాలను పొందుపర్చండి
- ఫొటో, నామినేషన్ డాక్యుమెంటేషన్‌ను అప్‌లోడ్ చేయండి
- సబ్మిట్‌పై క్లిక్ చేయండి
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.