చరిత్రలో ఫస్ట్‌టైమ్ : ట్రాన్స్‌జెండర్‌కు పద్మశ్రీ

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 04:32 AM IST
చరిత్రలో ఫస్ట్‌టైమ్ : ట్రాన్స్‌జెండర్‌కు పద్మశ్రీ

Updated On : January 26, 2019 / 4:32 AM IST

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 70వ రిపబ్లిడేను పురస్క‌రించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన ప్ర‌ముఖుల‌ను ప‌ద్మ పురస్కారాల‌కు ఎంపిక చేసింది. ఈ ఏడాది న‌లుగురికి ప‌ద్మ విభూష‌న్, 14 మందికి ప‌ద్మ భూష‌ణ్, 94 మందికి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలను ప్ర‌క‌టించింది.

 

కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల్లో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు. తమిళనాడుకి చెందిన నర్తకి నటరాజ్‌ను పద్మశ్రీ పురస్కారం వరించింది. మధురైలోని ఆలయంలో జన్మించారు. నర్తకి వయసు 54 ఏళ్లు. పద్మశ్రీ అందుకున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించారు.

 

భరతనాట్యం బాగా చేస్తారు. తంజావూరు భరతనాట్యం గొప్పదనాన్ని తెలియజేసేలా కృషి చేశారు. డ్యాన్స్ స్కూల్ స్థాపించి పిల్లలకు భరత నాట్యం నేర్పిస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఎంతోమంది నర్తకి వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి తమిళనాడు వస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ పై కృషి చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించారు. 2000లో అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా స్త్రీ శక్తి పురస్కారం అందుకున్నారు.