High alert on August 15 : ఉగ్ర దాడులకు పాక్ వ్యూహం..ఇంటలిజెన్స్ హెచ్చరికలతో హైఅలర్ట్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పలు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్‌తో సహా ఉగ్రవాద సంస్థలు ఆగస్టు 15న భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్‌ల వంటి బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని భద్రతా సంస్థలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది....

High alert on August 15
High alert on August 15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాకిస్థాన్ ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పలు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్‌తో సహా ఉగ్రవాద సంస్థలు ఆగస్టు 15న భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్‌ల వంటి బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని భద్రతా సంస్థలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. (Pak outfits plan terror strikes on August 15) విదేశీ సంస్థలతో పాటు, దేశంలోని ఉగ్రవాద సంస్థల ద్వారా భద్రతకు అంతరాయం కలిగించే అవకాశాలపై నిఘా సంస్థలకు కూడా సమాచారం అందింది. (security forces on High alert)
Shimla temple collapses : సిమ్లాలో కూలిన శివాలయం…9మంది మృతి
ఢిల్లీ చుట్టుపక్కల సున్నితమైన బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. ఢిల్లీలోని రైల్వే, ఢిల్లీ పోలీసు కార్యాలయాలు, ఎన్ఐఏ కార్యాలయాల వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని లష్కరే తోయిబాకు చెందిన పాక్ కార్యకర్త వెల్లడించారు. దీంతో ఢిల్లీలో పలు కీలక ప్రాంతాల్లో నిఘా పెట్టారు.
Himachal cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో మళ్లీ ఉప్పొంగిన బియాస్ నది…ఏడుగురి మృతి
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన ఒక కార్యకర్త ఢిల్లీతో సహా భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకోవడానికి జెఎమ్‌లు ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. 2023 మే నెలలో విడుదల చేసిన వీడియో సందేశంలో ఈ హెచ్చరిక వెలువడిందని ఇంటెలిజెన్స్ పేర్కొంది. సీమాంతర సంస్థలతో పాటు, స్వదేశీ ఉగ్రవాద సంస్థలు, సిక్కు తీవ్రవాదులు, లెఫ్ట్ వింగ్ తీవ్రవాదులు, ఈశాన్య తిరుగుబాటు గ్రూపుల ద్వారా భద్రతకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
Big accident in America : మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిపోయిన ఫైటర్ జెట్
దీంతో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నగరంలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. 10,000 మంది పోలీసు సిబ్బంది నిఘా ఉంచడంతో పాటు, 1,000 ముఖ గుర్తింపు కెమెరాలు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఎర్రకోటలో మోహరించారు.