Himachal cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో మళ్లీ ఉప్పొంగిన బియాస్ నది…ఏడుగురి మృతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా బియాస్ నది మళ్లీ ఉప్పొంగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు....

Himachal cloudburst : హిమాచల్ ప్రదేశ్‌లో మళ్లీ ఉప్పొంగిన బియాస్ నది…ఏడుగురి మృతి

Himachal cloudburst

Updated On : August 14, 2023 / 10:17 AM IST

Himachal cloudburst : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా బియాస్ నది మళ్లీ ఉప్పొంగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి జాదోన్ గ్రామంలో చోటుచేసుకుంది. (Himachal cloudburst kills 7) ఆరుగురిని రక్షించినట్లు సోలన్ డివిజనల్ కమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. (Beas river swells again) దీంతో కీలకమైన రోడ్లు మూసుకుపోయాయి.

China : చైనా వరదల్లో 21 మంది మృతి, ఆరుగురు గల్లంతు

వరదలతో వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. నదుల నీటి మట్టాలు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో చెట్టు విరిగి వాహనంపై పడటంతో ఓ ప్రైవేట్ బస్సు కండక్టర్ గాయపడ్డారు. మండిలో గరిష్టంగా 236, సిమ్లాలో 59, బిలాస్‌పూర్ జిల్లాలో 40తో సహా మొత్తం 621 రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలను మూసివేశారు. సిమ్లా, చండీగఢ్‌లను కలిపే కీలకమైన సిమ్లా-కల్కా జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి.

Big accident in America : మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిపోయిన ఫైటర్ జెట్

గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హమీర్‌పూర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. బియాస్ నది,దాని ఉపనదులు ఉప్పొంగాయి. ప్రజలు బయటకు వెళ్లవద్దని, బియాస్ నదీ తీరం, నుల్లాల దగ్గరకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఆగస్టు 14 నుంచి 17వతేదీ వరకు హిమాచల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం ఎల్లో అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది.

Independence Day : ఎర్రకోట వద్ద 10వేల పోలీసులు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో భారీభద్రత

తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-చంబా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. హరిద్వార్‌లోని గంగా నది 294.90 మీటర్ల వద్ద ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. చమోలి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తరాలి, నందా నగర్ ఘాట్ ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. చమోలిలోని పిండార్, నందాకిని నదుల నీటి మట్టాలు ఒక్కసారిగా పెరగడంతో పరిసర ప్రాంతాలు వరద ముప్పునకు గురయ్యాయి. ఈ వరదల్లో ఓ మోటారు వంతెన, వేలాడే వంతెన అర్థరాత్రి కొట్టుకుపోయాయి.

Seema Haider : నోయిడా ఇంటి వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీమాహైదర్…సినిమా ఆఫర్ తిరస్కరణ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నందా నగర్ ఘాట్ ప్రాంతంలో మందాకిని నది నీటిమట్టం కూడా పెరిగింది. ఫలితంగా లోతట్టుప్రాంతాల నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కోట్‌ద్వార్‌లో భారీ వర్షపాతంతో హో నది, మలన్ సుఖ్రో నదిలో నీటి మట్టాలు పెరిగాయి. ఈ నదుల ఒడ్డున ఉన్న పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. సహాయ కార్యక్రమాల కోసం పోలీసు బలగాలు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.