ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టింది. యుద్ధానికి కాలుదువ్వింది. 2019, ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పాక్ కు చెందిన  F-16S యుద్ధ విమానం భారత భూభాగంలోకి చొరబడింది.

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 06:17 AM IST
ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు

Updated On : February 27, 2019 / 6:17 AM IST

పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టింది. యుద్ధానికి కాలుదువ్వింది. 2019, ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పాక్ కు చెందిన  F-16S యుద్ధ విమానం భారత భూభాగంలోకి చొరబడింది.

పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొట్టింది. యుద్ధానికి కాలుదువ్వింది. 2019, ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం పాక్ కు చెందిన  F-16S యుద్ధ విమానం భారత భూభాగంలోకి చొరబడింది. రాజౌలీ సెక్టార్ లో చక్కర్లు కొట్టింది. అత్యంత వేగంగా వచ్చిన పాక్ యుద్ధ విమానం.. రాజౌలీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యాంప్ సమీపంలో బాంబులు వేసింది. పాక్ యుద్ధ విమానం భారత్ లోకి రావటాన్ని గుర్తించిన రాడార్లు.. వెంటనే ఎయిర్ ఫోర్స్ ను అప్రమత్తంచేశాయి. ఈ వెంటనే భారత యుద్ధ విమానాలు కూడా ప్రతిదాడికి ప్రయత్నించాయి. పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడాయి. అప్పటికే అది పాక్ లోకి వెళ్లిపోయింది.
Also Read: Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

రాజౌలీ సెక్టార్ లో పాక్ యుద్ధ విమానం ఎన్ని బాంబులు వేసింది.. ఎంత నష్టం జరిగింది.. అక్కడి పరిస్థితులు ఏంటీ అనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. భారత్ ఎయిర్ ఫోర్స్ కూడా దీనిపై సీరియస్ గా ఉంది. భారత్ దాడి చేసింది ఉగ్రవాద శిబిరాలపై.. పాక్ అందుకు విరుద్ధంగా భారత్ ఎయిర్ ఫోర్స్ బేస్ ను టార్గెట్ చేసుకుని బాంబులు వేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ఆర్మీ. ఇది ముమ్మూటికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు అని.. బరితెగింపునకు నిదర్శనం అంటున్నారు ఉన్నతాధికారులు.
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్