బెంగాల్ లోని పాక్ ఖైదీలు  హై సెక్యూరిటీ సెల్స్ కు తరలింపు   

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 10:02 AM IST
బెంగాల్ లోని పాక్ ఖైదీలు  హై సెక్యూరిటీ సెల్స్ కు తరలింపు   

Updated On : February 27, 2019 / 10:02 AM IST

కోల్ కతా : భారత్-పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో తరుణంలో దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు..భారత్ పై పాక్ దాడులకు మరోసారి యత్నించటం..దాన్ని భారత జవాన్లు తిప్పి కొట్టటం వంటి పలు కీలక పరిణామాల మధ్య సరిహద్దుల్లో యుద్శ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ జైళ్లలో ఉన్న 14 మంది పాకిస్థానీ ఖైదీలను ప్రభుత్వం హై సెక్యూరిటీ సెల్స్ కు తరలించింది. జైపూర్ సెంట్రల్ జైల్లో 50 ఏళ్ల పాక్ ఖైదీని తోటి ఖైదీలు కొట్టి చంపిన రోజుల వ్యవధిలో సీఎం మమతా బెనర్జీ  ఈ నిర్ణయం తీసుకున్నారు.   
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్

జైపూర్ సెంట్రల్ జైలు ఘటన క్రమంలో.. పాకిస్థాన్ ఖైదీలను ఇతర ఖైదీలకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశామని..పాక్ ఖైదీలకు మూడంచెల భద్రతను కల్పించామని  ఓ అధికారి తెలిపారు. వాస్తవానికి తోటి ఖైదీలతో పాక్ ఖైదీలు స్నేహపూర్వకంగానే ఉన్నారని… అయితే, పుల్వామా ఘటన నేపథ్యంలో రిస్క్ తీసుకోదలచుకోలేదని అన్నారు. పాక్ ఖైదీలు ఉన్న సెల్స్ పై జైలు అధికారులు నిరంతర నిఘా ఉంచుతారని చెప్పారు.
Also Read: మానవబాంబుల తయారీ కేంద్రంగా బాలకోట్