Himachal Pradesh : మేరా ఫౌజీ అమర్ రహే, పెళ్లి చీర ధరించి…భర్తకు కన్నీటి వీడ్కోలు

మేరా ఫౌజీ అమర్ రహే నినాదాలు చేస్తూ...తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికింది. పెళ్లి చీర ధరించి అంత్యక్రియల్లో పాల్గొనడం అందర్నీ...

Himachal Pradesh : మేరా ఫౌజీ అమర్ రహే, పెళ్లి చీర ధరించి…భర్తకు కన్నీటి వీడ్కోలు

Naik

Updated On : December 13, 2021 / 5:54 AM IST

Para Commando Lance Naik Vivek Kumar : మేరా ఫౌజీ అమర్ రహే నినాదాలు చేస్తూ…తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికింది. పెళ్లి చీర ధరించి అంత్యక్రియల్లో పాల్గొనడం అందర్నీ కంటతడిపెట్టించింది. అందరి ముందే కన్నీళ్లతో భర్తకు తుది వీడ్కోలు పలికింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఇందులో…సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు కూడా ఉన్నారు. మృతదేహాలు గుర్తు పట్టకుండా ఉండడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించిన అనంతరం వారి భౌతికకాయాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు.

Read More : Pushpa: సుక్కూ సర్.. నన్ను దత్తత తీసుకోండి..!

ఇందులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారా కమాండర్ లాన్స్ నాయక్ వివేక్ కుమార్ కూడా ఉన్నారు. ఇతని అంత్యక్రియలు సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో కాంగ్రా జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగాయి. వివేక్ కుమార్ సతీమణి…ప్రియాంక పెళ్లి నాటి చీర ధరించి అంత్యక్రియలకు హాజరయ్యారు. శ్మశానవాటిక వద్ద…మేరా ఫౌజీ అమర్ రహే అంటూ మూడు సార్లు నినాదాలు చేస్తూ…కన్నీటి వీడ్కోలు పలికారు.

Read More : Pushpa: 4 సినిమాల కష్టం పుష్ప.. తగ్గేదే లే.. 17న వస్తున్నా..!

ఈ దృశ్యం అందర్నీ కలిచివేసింది. అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు. తన భర్తను చూసి చాలా గర్వపడుతున్నట్లు, తమకు ఆరు నెలల బిడ్డ ఉందని..చిన్నారి భవిష్యత్ కోసం వివేక్ ఎన్నో కలలు కన్నారని తెలిపారు. తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. వివేక్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల రూపాయలు ప్రకటించింది.