Gujarat Govt New Rule : ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.. గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన
తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.

Gujarat Govt New Rule
Love Marriage – Parents Permission : ప్రేమ వివాహానికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకరానుంది. ప్రేమ వివాహానికి వారి తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేసింది. పిల్లలు ప్రేమ వివారం చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ వ్యవస్థను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు.
ఈ మేరకు మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండాలన్న అంశానికి సంబంధించి రాజ్యంగం ప్రకారం అవకాశం ఉందా? లేదా? అనేది పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తీసుకొస్తే తాము మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం గమనార్హం.