Union Government : నేడు రాజ్యసభ ముందుకు 6 బిల్లులు.. 2 బిల్లులు ప్రవేశపెట్టడం సహా 4 బిల్లులపై చర్చ, ఆమోదానికి
వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.

Rajya Sabha
Rajya Sabha – Six Bills : కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభ ముందుకు 6 బిల్లులు తీసుకురానుంది. బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు, 2023 సహా ఆరు బిల్లులను రాజ్యసభ ముందుకు తీసుకురానుంది. రెండు బిల్లులు ప్రవేశపెట్టడం సహా నాలుగు బిల్లులపై చర్చ, ఆమోదానికి పెట్టింది. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023 ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.
మధ్యవర్తిత్వ బిల్లు 2021, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు, 2023 జీవ వైవిధ్యం సవరణ బిల్లు, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లులపై చర్చ ఆమోదానికి కేంద్రం పెట్టింది. న్యాయవాదుల చట్టం, 1961ని సవరించడానికి రాజ్యసభలో న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యవర్తిత్వ బిల్లు, 2021ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
వివాదాల పరిష్కారం, వాణిజ్యపరమైన లేదా ఇతరత్రా, మధ్యవర్తిత్వ పరిష్కార ఒప్పందాలను అమలు చేయడం కోసం మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సులభతరం చేయడానికి మధ్యవర్తిత్వానికి, ప్రత్యేకించి సంస్థాగత మధ్యవర్తిత్వానికి బిల్లు ఉపయోగపడనుంది.
మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు, 2023ని రాజ్యసభలో కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. జీవ వైవిధ్య (సవరణ) బిల్లు, 2023,అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.