కుమారుడిని చూడడానికి కాలేజీ హాస్టల్‌కి వెళ్లిన తల్లిదండ్రులు.. వారికి విగతజీవిగా కనపడిన కొడుకు
మాలిక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి తల్లిదండ్రులు, ఇన్‌స్టిట్యూట్ సెక్యూరిటీ గార్డులు హాస్టల్ గది తలుపులను పగులకొట్టి తెరిచారు.

IIT-Kharagpur
కుమారుడిని చూడడానికి కాలేజీ హాస్టల్‌కి వెళ్లిన తల్లిదండ్రులకు అతడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనపడ్డాడు. ఈ ఘటన ప్రతిష్ఠాత్మక ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో మూడవ సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న షాన్ మాలిక్ అక్కడి ఆజాద్ హాల్ ఆఫ్ రెసిడెన్స్‌లో ఉండేవాడు.
అతడిని చూసి వెళ్లడానికి ఆదివారం తల్లిదండ్రులు వచ్చారు. మాలిక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మాలిక్ తల్లిదండ్రులు, ఇన్‌స్టిట్యూట్ సెక్యూరిటీ గార్డులు హాస్టల్ గది తలుపులను పగులకొట్టి తెరిచారు.
గదిలో షాన్ మాలిక్ విగతజీవిగా కనపడ్డాడు. దీనిపై ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ అమిత్ పాత్ర మాట్లాడుతూ.. అతడి బలవన్మరణానికి గల కారణాలు ఏంటో తెలియదని అన్నారు. తమకు ఇప్పటివరకు ఎటువంటి సూసైడ్ నోట్ కనపడలేదని చెప్పారు. షాన్ మాలిక్ బాగా చదువేవాడని తెలిపారు.
అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదని అన్నారు. మాలిక్‌కు లెక్చరర్లతోనూ మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మాలిక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం మేదినీపూర్ మెడికల్ కాలేజీకి శవపరీక్ష కోసం పంపారు. విద్యార్థి బలవన్మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Z-Morh Tunnel: జడ్-మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ