Z-Morh Tunnel: జడ్-మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
మోదీతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా సీఎం ఒమర్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు.

జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించారు. ఈ సొరంగాన్ని గాందర్‌బల్ జిల్లాలో నిర్మించారు. టన్నెల్ లోపల మోదీ పరిశీలించారు. మోదీతో పాటు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా సీఎం ఒమర్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు.
సొరంగం ప్రత్యేకతలు
- రూ.2,700 కోట్లతో సొరంగం నిర్మాణం
- శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్ ప్రాంతంలో నిర్మాణం
- సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో నిర్మాణం
- 6.5 కిలోమీటర్ల పొడవుతో సొరంగం
- ఈ సొరంగం ద్వారా ఏ కాలంలోనైనా లద్దాఖ్‌ను రహదారి మార్గం ద్వారా చేరుకునే వీలు
- 2015 మేలో ప్రారంభమైన నిర్మాణ పనులు
- గత ఏడాది పూర్తయిన పనులు
- సోన్‌మార్గ్‌కు పర్యాటకుల సందడి పెరిగే అవకాశం
- లద్దాఖ్‌లో జాతీయ రక్షణ అవసరాలకు వ్యూహాత్మక ప్రాముఖ్యతనిచ్చి సొరంగం నిర్మించారు
- కనెక్టివిటీని మరింత పెంచేలా నిర్మాణం
- ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపర్చనున్న సొరంగం
- రహదారి కనెక్టివిటీ ప్రమాణాలను మరింత మెరుగుపర్చనున్న నిర్మాణం
- గగాంగీర్, సోనామార్గ్ మధ్య అంతరాయం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు
Gangula Kamalakar: సంజయ్‌పై కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి కారణం అదే.. గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు