Gangula Kamalakar: సంజయ్‌పై కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి కారణం అదే.. గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు

కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..

Gangula Kamalakar: సంజయ్‌పై కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి కారణం అదే.. గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు

Gangula Kamalakar

Updated On : January 13, 2025 / 3:00 PM IST

Gangula Kamalakar: కరీంనగర్ కలెక్టరేట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం సంజయ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన స్పీకర్ నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాజా పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Padi Kaushik Reddy: కలెక్టరేట్ ఘటన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు

నాలుగు పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను.. సమీక్ష సమావేశాల్లో రాజకీయ అంశాలు వచ్చినప్పుడు దూషించుకోవడం స‌హ‌జం. కానీ, పోలీస్ లు ఏనాడూ ఎమ్మెల్యేను లాక్కెళ్ళ లేదు. అసెంబ్లీలో స్పీకర్ అనుమతితోనే మార్షల్స్ తీసుకెళ్తారు. ఆదివారం జరిగిన ఘటనలో ముగ్గురు మంత్రుల అనుమతితోనే పోలీసులు స‌మావేశంలోకి వ‌చ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని లాక్కెళ్లారా అని గుంగుల ప్ర‌శ్నించారు. మీ ఆదేశంతోనే లాకెళ్లరు అంటే మీరు సభను నడపడంలో విఫలమయ్యారు. పక్కన ఉన్న ఎమ్మెల్యే సంజయ్ ఇరిటేషన్ చేస్తున్నాడని కౌశిక్ రెడ్డి అన్నాడు. కౌశిక్ రెడ్డి ఏమన్నాడు.. కొట్టలేదు కదా..? ఎంత మందిమీద కేసులు పెడతారు అంటూ గంగుల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి స‌భ‌ను న‌డ‌ప‌డంలో ఫెయిల్యూర్ అయ్యారు. గొడవ అవుతుంద‌ని ఆయనకు ముందే తెలుసా? ఎందుకు అంతమంది పోలీసులతో బందోబస్తు పెట్టారు. జిల్లా మంత్రుల ప్రమేయం లేకపోతే కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని గంగుల సూచించారు. ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య వైరం ఉంది. అది పార్టీల మీద రద్దొద్దని గంగుల అధికార పార్టీ నేతలకు సూచించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేస్తారా? వంద శాతం కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. వాళ్లిద్దరూ పక్కనే ఉన్నారు. వాళ్లు ఏం మాట్లాడుకున్నారో.. సంజయ్ కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అతని ఇబ్బందిని తట్టుకోలేకనే కౌశిక్ రెడ్డి అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని గంగుల పేర్కొన్నారు.