పతంజలి బాలకృష్ణ కు గుండెపోటు

రిషికేశ్ : ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు అత్యంత సన్నిహితుడు, ‘పతంజలి’ యోగ పీఠం ఎండీ ఆచార్య బాలకృష్ణ అస్వస్ధతకు గురయ్యారు. ఆగస్టు 23 శుక్రవారం సాయంత్రం తల తిరగడం, ఛాతి నొప్పి రావడంతో ఆయనను మొదట హరిద్వార్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయన్ను పరిశీలించి మెరుగైన చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు.
ప్రస్తుతం ఆయనకు ఎయిమ్స్ అత్యవసర విభాగంలోని వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. న్యూరో ఫిజీషియన్ , కార్డియాలజిస్టు బాలకృష్ణను పరీక్షించారని, ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని, విశ్రాంతి తీసుకోకుండా పని చేయటం వల్ల అనారోగ్యానికి గురైనట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు వైద్యులుతెలిపారు.
మరికొన్ని వైద్యపరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యంపై పూర్తి స్ధాయి వివరణ ఇస్తామని ఎయిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బ్రహ్మ ప్రకాష్ తెలిపారు.