Amarinder Singh : సై అంటే సై అంటున్న అమరీందర్..అక్కడ నుంచే అసెంబ్లీ బరిలోకి
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదివారం

Amarinder (1)
Amarinder Singh : వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పాటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదివారం అమరీందర్ సింగ్ ప్రకటించారు. పాటియాలా 400 ఏళ్లుగా తమతోనే ఉందని, సిద్ధూ కారణంగా తాను దానిని వదిలి వెళ్లడం లేదని ఫేస్ బుక్ ద్వారా అమరీందర్ సృష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సిద్ధూతో మధ్య వైరం కొనసాగుతున్న సమయంలో తనపై పోటీ చేయమని అమరీందర్ సిద్ధూకి సవాలు విసిరిన విసిరిన విషయం తెలిసిందే.
కాగా, పాటియాలా నియోజకవర్గం..అమరీందర్ సింగ్ కుటుంబానికి బలమైన కోటగా ఉంది. అమరీందర్ తండ్రి మహారాజా సర్ యాదవీందర్ సింగ్.. రాచరిక పాటియాలా రాష్ట్రానికి చివరి మహారాజు. అమరీందర్ సింగ్ నాలుగు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ 2014 నుండి 2017 వరకు మూడు సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
మరోవైపు, ఈ నెల ప్రారంభంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని పెడుతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన పార్టీ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని అమరీందర్ చెప్పారు.
కాగా,ప్రస్తుత పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిస్ఠానం తనను అవమానించిందని పేర్కొంటూ ఈ ఏడాది సెప్టెంబర్ లో పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ALSO READ CM KCR : ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. మూడు రోజులు అక్కడే..!