ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలపై సుప్రీంకోర్టులో పిటిషన్
దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.

దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో 350కి పైగా గనుల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలిపారు. 2014 లో వివిధ సంస్థలకు ఇచ్చిన గనుల కేటాయింపులు రద్దు చేయాలని అన్నారు. మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పిటిషన్ ను విచారించిన కోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
Read Also : మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ
2014లో నిబంధనలను ఉల్లంఘిస్తూ వివిధ సంస్థలకు గనుల కేటాయింపులు చేశారని పిటిషనర్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా దేశ సంపదను దోచుకునే విధంగా ఇప్పుడు మైనింగ్ జరుగుతుందని చెప్పారు. దేశంలో 6 లక్షల కుంభకోణం జరుగుతోందని.. అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. 10 రాష్ట్రాల్లో మైనింగ్ జరుగుతోందని.. గనుల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నారు. రఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించి అక్రమాలు జరిగాయని… దేశ సంపదను మోడీ ప్రభుత్వం లూటీ చేస్తోందని న్యాయవాది ఎంఎల్ శర్మ గతంలో హైకోర్టులో పిటిసన్ దాఖలు చేశారు.
Read Also : ఏపీలో అరాచకం.. కేంద్ర బలగాలు రావాలి : గవర్నర్ తో జగన్