Petrol Price Hike: పెట్రో బాంబ్.. మరోసారి పెరిగిన ధరలు!

సామాన్య ప్రజలపై ఏ మాత్రం కనికరం లేకుండా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే వెళ్తున్నాయి.

Petrol Price Hike: పెట్రో బాంబ్.. మరోసారి పెరిగిన ధరలు!

Petrol Prices Hike

Updated On : March 31, 2022 / 6:54 AM IST

Petrol Price Hike: సామాన్య ప్రజలపై ఏ మాత్రం కనికరం లేకుండా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే వెళ్తున్నాయి. గత పదిరోజుల్లో తొమ్మిదిసార్లు ధరలను పెంచిన సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ పై 80 పైసలు చొప్పున పెంచాయి. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.40 కు చేరగా.. డీజిల్ ధర 101.56 కు చేరింది. ఇక తొలి నుండి రేటు అధికంగా ఉన్న ఏపీలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117, డీజిల్ ధర రూ.103 దాటింది.

Petrol Price Hike: పెట్రోల్ ధరల పెంపు: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎటాక్

గత శ‌నివారం చ‌మురు కంపెనీలు పెట్రోల్‌పై 89 పైస‌లు, డీజిల్ పై 86 పైస‌లు పెంచడంతో మొదలైన ఈ వాయింపుడు ప్రతిసారి 80 పైసలు పైన పెంచుతూ వస్తున్నాయి. చమురు కంపెనీల పెంపుకు మళ్ళీ రాష్ట్రాల పన్నులు కలుపుకుంటే ఇది 90 పైసల పైనే ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్‌ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం.

Petrol price: రూ.150 దాటనున్న పెట్రోల్ ధర.. కారణం ఇదే!

అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. ఎన్నికల అనంతరం గత వారం నుంచి బాదుడు మొదలవగా.. నిపుణుల అంచనా ప్రకారం ధరలు రూ.120-125 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.