Draupadi Murmu : రాష్ట్రపతి హెలికాప్టర్‌తో సెల్ఫీ తీసుకున్నందుకు మెడికల్ ఆఫీసర్ సస్పెండ్

మెడికల్ అధికారిగా హెలికాప్టర్‌ దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని తన ఫేస్ బుక్ తో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌ అయ్యింది. అంతే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Draupadi Murmu : రాష్ట్రపతి హెలికాప్టర్‌తో సెల్ఫీ తీసుకున్నందుకు మెడికల్ ఆఫీసర్ సస్పెండ్

Draupadi Murmu chopper

Updated On : May 9, 2023 / 9:16 AM IST

Draupadi Murmu :  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశా పర్యటనలో పలు ఆసక్తికర అంశాలుచోటుచేసుకుంటున్నారు. గతంలో ద్రౌపదీ ముర్ము పాల్గొన్న ఒక కార్యక్రమంలో విద్యుత్ సరఫరా నిలిపోయంది. తాజాగా మరో వివాదం తలెత్తింది. ఓ మెడికల్ ఆఫీసర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించే హెలికాప్టర్ తో సెల్పీ దిగటం తీవ్ర చర్చనీయాంశమైంది. ద్రౌపదీ ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఆమె పర్యటనలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

రాష్ట్రపతి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మయూర్‌ భంజ్‌ జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచారు. మయూర్‌భంజ్‌లోని చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) యశ్వంత్‌ బెహరా అనే మెడికల్ అధికారిగా హెలికాప్టర్‌ దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడితో ఊరుకోకుండా దాన్ని తన ఫేస్ బుక్ తో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌ అయ్యింది. రాష్ట్రపతి ప్రయాణించే వాహంనపై సెల్ఫీ తీసుకోవటాన్ని భద్రతాలోపంగా భావించారు. పలువురు విమర్శించారు.

దీంతో ఆరోగ్యశాఖ అధికారులు యశ్వంత్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మే 5న సిమిలిపాల్ నేషనల్ పార్కును సందర్భంగా సందర్భంగా రాష్ట్రపతి వైద్య బృందంలో బెహెరాను నియమించారు. ఈ సందర్భంగా బెహెరా హెలికాఫ్టర్ తో సెల్పీ తీసుకోవటంతో సస్పండ్ అయ్యారు.