బోర్డింగ్ పాస్, రైల్వే టికెట్లపై ప్రధాని మోడీ ఫొటోలు తొలగించాలి : సీఈసీ

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 09:55 AM IST
బోర్డింగ్ పాస్, రైల్వే టికెట్లపై ప్రధాని మోడీ ఫొటోలు తొలగించాలి : సీఈసీ

Updated On : March 30, 2019 / 9:55 AM IST

ఢిల్లీ : రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలను ఇంకా ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు రోజుల క్రితం సీఈసీ పంపింది. గత రెండు రోజుల్లో సీఈసీ రెండు మంత్రిత్వశాఖలకు నోటీసులు ఇవ్వటం ఇది రెండోసారి కావటం గమనార్హం. 

టికెట్లపై మోడీ ఫొటోలను తొలగించాలని కోరినా రెండు డిపార్ట్ మెంట్లు ఎలాంటి చలనం లేకుండా వ్యవహరించడంతోనే సీఈసీ రెండో నోటీసు పంపింది. సీఈసీ కోడ్ ను స్వయంగా కేంద్ర మంత్రిత్వ కార్యాలయాలే ఉల్లంఘించడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతుండంతో ఈసీ మరోసారి నోటీసులు పంపింది.