లిబియా వదిలి భారత్ కు వచ్చేయండి

  • Published By: venkaiahnaidu ,Published On : April 19, 2019 / 04:11 PM IST
లిబియా వదిలి భారత్ కు వచ్చేయండి

Updated On : April 19, 2019 / 4:11 PM IST

లిబియా దేశంలో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.లిబియాలో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం(ఏప్రిల్-19,2019)ట్విట్టర్ వేదికగా సుష్మా స్పందించారు.లిబియాలో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలి.లిబియా నుంచి చాలా మందిని తరలించినా.. ఆదేశంలో పర్యటనను నిషేధించినా లిబియా రాజధాని ట్రిపోలిలో సుమారు 500కు పైగా భారతీయులు ఉన్నారు. ట్రిపోలిలో పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. ప్రస్తుతం ట్రిపోలి నుంచి విమాన సర్వీసులు నడుపుతున్నాం. ట్రిపోలిని తక్షణమే వీడాలని మీ బంధుమిత్రులకు చెప్పండి. తర్వాత లిబియా నుంచి భారత్‌ కు రప్పించడం కష్టతరం అవుతుందని సుష్మా స్వరాజ్‌ తన ట్వీట్ ద్వారా తెలిపారు.