ట్రాఫిక్ ఆంక్షలు లేవు..బందోబస్త్ లేదు : ఆకస్మికంగా మోడీ గురుద్వారా సందర్శన

PM At Delhi Gurdwara ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్‌గంజ్ సాహిబ్‌ను ఆదివారం(డిసెంబర్-20,2020)ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్ బహదూర్’ కి మోడీ ఈ సందర్భంగా నివాళలర్పించారు. ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.
కాగా ‘గురు తేగ్ బహదూర్’ వర్ధంతి జరిగిన విషయం తెలిసిందే. ఆయన వర్థంతి కార్యక్రమం జరిగిన ఒకరోజు తర్వాత ఇవాళ మోడీ గురుద్వారాని సందర్శించారు. ఓవైపు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది
అయితే, ప్రధాని గురుద్వారా సందర్శన.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించినది కాదు. ఈ పర్యటనను ఉన్నట్టుండి ప్లాన్ చేశారు. సాధారణంగా ప్రధాని ఇలాంటి పర్యటనకు వెళ్తే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ఏ విధమైనటువంటి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. అక్కడ పోలీసు బందోబస్తు లేదని, ఎక్కడా బారికేడ్లు పెట్టలేదని అధికారులు తెలిపారు.
అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదని, సామాన్యులకు ఎలాంటి అడ్డంకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. ప్రధాని మోడీ వస్తున్నారని గురుద్వారా కమిటీ సభ్యులకు కూడా ముందుగా తెలియదు. అందుకే ఎటువంటి స్వాగత ఏర్పాట్లు కూడా చేయాలేదు. లేత నారింజ రంగు జుబ్బా, ముందురు ఆరెంజ్ రంగు పైకోటు, తెలుపు పైజామా ధరించిన మోడీ… ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా గురుద్వారా రకాబ్ గంజ్ చేరుకొని గురు తేగ్ బహదూర్‌కు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురుద్వారా నిర్వాహకులు, కమిటీ సభ్యులకు మోడీని సన్మానించారు. మోడీతో సెల్ఫీ తీసుకోవడానికి సందర్శకులు పోటీ పడ్డారు.
తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటోలను మోడీ ట్విటర్‌లో షేర్ చేశారు. నేను ఈ రోజు శ్రీ గురు తేగ్ బహదూర్ జి యొక్క ధర్మబద్ధమైన మృతదేహాన్ని దహనం చేయబడిన చారిత్రాత్మక గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ లో ప్రార్థనలు చేశాను. ఈ ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితులను చేసి, ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లించిన గురు తేగ్‌బహదూర్ దయతోనే ఎంతో ప్రేరణ పొందాను.గురు సాహిబ్స్ విశేష కృపతోనే మన ప్రభుత్వ పాలనా కాలంలో గురు తేగ్‌బహదూర్ 400వ ప్రకాశ్ పర్వాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తేగ్ బహదూర్ ఆదేశాలను గుర్తు చేసుకుంటున్నాం అని మోడీ తన ట్వీట్ లో తెలిపారు.
కాగా, ఢిల్లీలో గురుద్వారా రకాబగంజ్ 1783వ సంవత్సరంలో నిర్మితమైంది. ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాల్లో ఎక్కువ మంది సందర్శకులు వెళ్లే గురుద్వారాల్లో ఇదీ ఒకటి. గురు తేగ్ బహదూర్ సిక్కు మతంలోని పదిమంది గురువులలో తొమ్మిదవ గురువు. 17వ శతాబ్దంలో ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అతన్ని హత్య చేశారు.
Some more glimpses from Gurudwara Rakab Ganj Sahib. pic.twitter.com/ihCbx57RXD
— Narendra Modi (@narendramodi) December 20, 2020
गुरु साहिब की यह विशेष कृपा है कि हमारी सरकार के कार्यकाल के दौरान ही हमें श्री गुरु तेग बहादुर जी के 400वें प्रकाश पर्व को मनाने का अवसर मिल रहा है। आइए, इस पावन मौके को ऐतिहासिक बनाएं और श्री गुरु तेग बहादुर जी के आदर्शों को अपने जीवन में अपनाएं। pic.twitter.com/fXxVRUU1yI
— Narendra Modi (@narendramodi) December 20, 2020