PM Kisan Scheme : రైతులకు శుభవార్త.. రేపు ఖాతాల్లోకి డబ్బులు, మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి…

దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.

PM Kisan Scheme : రైతులకు శుభవార్త.. రేపు ఖాతాల్లోకి డబ్బులు, మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి…

Pm Kisan Scheme

Updated On : August 8, 2021 / 9:41 AM IST

PM Kisan Scheme : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. వీటిల్లో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అన్నదాతలకు చేయూత అందించేందుకు, ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ఈ స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ కింద మోదీ సర్కార్ పెట్టుబడి సాయంగా నేరుగా రైతుల అకౌంట్లలోకి క్రమం తప్పకుండా డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా పీఎం కిసాన్‌ నిధి కింద 9వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం(ఆగస్టు 9,2021) మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నారు. తద్వారా 9.75 కోట్లమంది రైతులకు రూ.19వేల 500 కోట్లు బదిలీ కానున్నాయి. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

డిసెంబర్ 1, 2018లో పీఎం కిసాన్ నిధి పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద, ఏడాదికి 6వేల రూపాయల ఆర్థిక ప్రయోజనం అర్హత కలిగిన రైతు కుటుంబాలకు అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమానమైన వాయిదాలలో అంటే నాలుగు నెలలకు ఓసారి 2వేల రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకంలో, ఇప్పటివరకూ 1.38 లక్షల కోట్లు రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది. 8వ విడ‌త ఇన్‌స్టాల్‌మెంట్ మే 14న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్‌-జులై మధ్య కాలానికి ఈ ఏడాది విడుదల చేసిన తొలి విడత మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని 58,12,339 మంది రిజిస్టర్డ్‌ లబ్ధిదారులకు గాను 49,67,167 మందికి దక్కింది. తెలంగాణలో 39,33,846 మందికి గాను 36,39,777 మందికి లభించింది.

పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవ‌చ్చు..
* పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: https://pmkisan.gov.in/
* కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపిక చేసుకోవాలి
* ‘లబ్ధిదారుల జాబితా’ ఎంపికపై క్లిక్ చేయాలి
* కొత్త పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలను ఫిల్ చేయాలి
* గెట్ రిపోర్ట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి
* వ‌చ్చిన‌ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ప‌రిశీలించుకోవ‌చ్చు.

పీఎం కిసాన్ నిధి లబ్ధిదారు తన బ్యాంకు ఖాతాలో డబ్బులు పడింది లేనిది ఇలా తెలుసుకోవచ్చు.

* ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి.

* హోమ్ పేజీలో ఉన్న ‘లబ్ధిదారుని స్థితి’(Beneficiary Status) పై క్లిక్ చేయండి.

* ఆ తర్వాత ఒక ఆప్షన్ ఎంచుకోండి – ఆధార్ నంబర్, అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నంబర్.

* తర్వాత, ‘డేటాను పొందండి’(Get Data) పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా అక్కడే కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి