PM Modi to Students: భారత్ లోనే మెడిసిన్ చదవొచ్చుగా: ప్రధాని మోదీ

చిన్న దేశాల్లో సౌకర్యలు అంతగా ఉండవని.. పైగా అక్కడి బాష తెలియక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు.

PM Modi to Students: భారత్ లోనే మెడిసిన్ చదవొచ్చుగా: ప్రధాని మోదీ

Modhi

Updated On : February 26, 2022 / 11:09 PM IST

PM Modi to Students: విదేశాలకు వెళ్లి వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కంటే చిన్న దేశాలు, సౌకర్యంగా లేని ప్రాంతాలకు వెళ్లి వైద్య విద్యనభ్యసించడం దేనికని, విద్యార్థులు మంచి సీటు సాధించి భారత్ లోనే వైద్యవిద్య అభ్యసించవచ్చని మోదీ సూచించారు. కోట్ల రూపాయల ఖర్చుతో పాటు బాష కూడా రాకుండా విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మోదీ అన్నారు. యుక్రెయిన్ నుంచి భారత విద్యార్థుల తరలింపు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆరోగ్య రంగంపై శనివారం నిర్వహించిన వెబినార్ లో ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులకు ఈ సలహా ఇచ్చారు.

Also read: President Convoy: రాష్ట్రపతి కాన్వాయిలోని ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నేరుగా యుక్రెయిన్ పేరు ప్రస్తావించకుండా.. వైద్య విద్యార్థులనుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. చిన్న దేశాల్లో సౌకర్యలు అంతగా ఉండవని.. పైగా అక్కడి బాష తెలియక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు. అదే సమయంలో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యకోసం దేశం ధాటి వెళితే.. వారితో పాటుగా కోట్ల రూపాయల నగదు కూడా విదేశాలకు తరలివెళ్తుందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ లో మెడిసిన్ చదువు అభివృద్ధి కోసం ప్రైవేటు రంగ సంస్థలు పెట్టుబడి పెట్టె ఆలోచన చేయడం లేదా? కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలు ఈ విషయాలపై ఎందుకు ఆలోచించడం లేదని? మోదీ సూచనప్రాయంగా ప్రశ్నించారు.

Also read: Russia-Ukraine Conflict : ప్రధాని మోదీకి యుక్రెయిన్ అధ్యక్షుడి ఫోన్.. రష్యా దురాక్రమణ ఆపాలని విజ్ఞప్తి!

కాగా ఇంజనీరింగ్, మెడిసిన్ చదువు నిమిత్తం ఒక్క యుక్రెయిన్ లోనే 20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. యుక్రెయిన్ లో మెడిసిన్ సీటు కనిష్టంగా రూ.15 లక్షలు ఉండగా గరిష్టంగా రూ.30 లక్షలు ఉంది. భారత్ తో పోలిస్తే ఇది దాదాపు 200 శాతం తక్కువ. యుక్రెయిన్ ఎంబీబీఎస్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. అదే సమయంలో యుక్రెయిన్ లో చదువుకోవడం ద్వారా యూరోప్ లోని ఇతర దేశాలకు ఈజీగా వీసా సంపాదించవచ్చు. ఇండియాలో ప్రతి 20 మంది అభ్యర్థులకు గానూ ఒక్క ఎంబీబీఎస్ సీటు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో అనేక మంది విద్యార్థులు తమ కలను నెరవేర్చుకునేందుకు విదేశాలకు వెళ్తున్నారు.

Also read: UN Security Council : యుఎన్ భద్రతా మండలి అంటే ఏంటి? యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఎలా అడ్డుకోగలదు?