PM Narendra Modi: మోదీ సరికొత్త రికార్డు.. వారంరోజుల్లోనే 50లక్షల మంది ఫాలోవర్లు.. మీరూ జాయిన్ కావాలనుకుంటున్నారా.

వాట్సాప్ చానెల్ లో అత్యధిక, వేగవంతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రపంచ నాయకుడు పీఎం మోదీ కావటం గమనార్హం.  మీరు మోదీ వాట్సాప్ ఛానెల్ లో చేరాలంటే ..

PM Narendra Modi: మోదీ సరికొత్త రికార్డు.. వారంరోజుల్లోనే 50లక్షల మంది ఫాలోవర్లు.. మీరూ జాయిన్ కావాలనుకుంటున్నారా.

Narendra Modi

PM Modi Whatsapp Group Channel: మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకే పరిమితమైంది. అయితే, దీని పరిధిని మరింత పెంచుతూ వాట్సాప్ ఛానెల్ అందుబాటులోకి వచ్చిన విషయం విధితమే. దీని నుంచి సెలబ్రెటీలు, క్రికెటర్లు, రాజకీయ నేతలు, హీరోలు, బిజినెస్ మెన్లను ఫాలో అవ్వొచ్చు. ఉదాహరణకు, తమ అభిమాన హీరో, స్పోర్ట్స్ స్టార్లు, ఫేమస్ క్రియేటర్లు క్రియేట్ చేసిన చానెళ్లను వాట్సాప్ యూజర్లు నేరుగా సెర్చ్ చేసే చాన్స్ లభిస్తుంది. ఈ యాప్ లో అప్ డేట్ చానెల్స్ ద్వారా వీరిని ఫాలో అవ్వొచ్చు.

PM Modi : దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు.. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక వాట్సాప్ ఛానెల్‌ని వారం రోజుల క్రితం ప్రారంభించారు. అయితే, ఈ వాట్సాప్ చానల్ సరికొత్త రికార్డు సృష్టించింది. వాట్సాప్ చానల్‌లో మోదీని అనుసరిస్తున్న వారి సంఖ్య వారం రోజుల్లో వ్యవధిలోనే 50లక్షలకు చేరింది. ఈ వాట్సాప్ ఛానెల్‌లో మోదీ మొదటి పోస్టుగా కొత్త పార్లమెంట్ భవనంలో కూర్చొని ఉన్న చిత్రాన్ని ఉంచారు. అయితే, వారంరోజుల్లోనే 50 లక్షల మంది ఫాలోవర్సును దాటినందుకుగాను తన చానెల్‌లో చేరినందుకు వాట్సాప్ కమ్యూనిటీకి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం, వాట్సాప్ చానెల్ లో అత్యధిక, వేగవంతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రపంచ నాయకుడు పీఎం మోదీ కావటం గమనార్హం.  మీరూ మోదీ వాట్సాప్ ఛానెల్‌లో చేరాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయాలి.

PM Modi Telangana Tour: తెలంగాణలో మోదీ పర్యటన తేదీలు ఖరారు.. బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ..

వాట్సాప్ చానెల్‌ను ఎలా క్రియేట్ చేయాలంటే..
– ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి
– ఆ తరువాత మీరు అప్‌డేట్స్ ట్యాప్‌పై క్లిక్ చేయాలి
– తర్వాత మీకు ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ముందున్న +చిహ్నంపై నొక్కాలి.
– ట్యాప్ చేసిన తరువాత, Find Channels మరియు New Channel మీ ముందు కనిపిస్తాయి.
– దీనిలో మీరు న్యూ చానల్ ఆప్షన్ ను ట్యాప్ చేయాలి.
– దీని తరువాత కొత్త పేజీ తెరవబడుతుంది.
– అందులో మీరు కొనసాగించు ఎంపికపై నొక్కండి.
– దీని తరువాత మీరు చానెల్ పేరు, దాని వివరాలను నమోదు చేయాలి.
– ప్రొఫైల్ ఫొటోను కూడా జత చేయాల్సి ఉంటుంది.
– దీని తరువాత ఛానెల్ సృష్టించు ఎంపిక ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.