Kashi Vishwanath Dham : కాశీ విశ్వనాథ్ మందిర్ సిబ్బందికి చెప్పులు పంపించిన మోదీ

కార్మికులపై ప్రధాని పూలవర్షం కురిపించి..వారితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో...ఆలయంలో పని చేసే సిబ్బంది చెప్పులు లేకుండా..చలిలోనే..విధులను నిర్వహిస్తున్నారని...

Kashi Vishwanath Dham : కాశీ విశ్వనాథ్ మందిర్ సిబ్బందికి చెప్పులు పంపించిన మోదీ

Modi Kashi

Updated On : January 10, 2022 / 2:03 PM IST

PM Modi Has Sent 100 Pairs Of Jute Footwear : కాశీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశ్వేశ్వరుడి ఆలయంలో పని చేసే సిబ్బందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 100 జతల పాదరక్షలను పంపించారు. వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడున్న ఈ ఆలయం అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. పలు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటీవలే కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించేందుకు వారణాసికి వచ్చారు.

Read More : Janasena : విందులు, వినోదాలు వద్దు..సంక్రాంతిని ఇంట్లోనే జరుపుకోండి..పవన్ కళ్యాణ్ సూచన

అక్కడున్న సిబ్బందితో మాట్లాడారు కూడా. కార్మికులపై ప్రధాని పూలవర్షం కురిపించి..వారితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో…ఆలయంలో పని చేసే సిబ్బంది చెప్పులు లేకుండా..చలిలోనే..విధులను నిర్వహిస్తున్నారని మోదీ తెలుసుకున్నారు. దీంతో 2022, జనవరి 10వ తేదీ వంద జతల పాదరక్షలను పంపించారు. ఇవి జ్యూట్ తో తయారు చేయడం విశేషం. ఆలయంలో…తోలు లేదా..రబ్బరుతో తయారు చేసిన పాదరక్షలను ధరించడం నిషేధం.

Read More : RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

పూజారులు, సేవలు చేసే వ్యక్తులు, సెక్యూర్టీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, ఇతరులు అలాగే ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం పంపించిన జ్యూట్ పాదరక్షలు దరించి..చల్లని వాతావరణంలో పని చేయవచ్చు. మోదీ పంపించిన చెప్పులను అక్కడున్న సిబ్బందికి అందించారు.