PM Modi : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.. మోదీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుంది

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.

PM Modi : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.. మోదీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుంది

PM Modi

PM Modi : తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర విద్యా సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి భవనాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఐఐఎం విశాఖ, ఐఐఐటీడీఎం కర్నూల్, శాశ్వత క్యాంపస్ లు ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్ ను వర్చువల్ గా మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉన్న విద్యలో ఉన్నత ప్రమాణాలకు ఎన్డీయే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మోదీ చెప్పారు. విద్యార్థులకు ఆధునిక శిక్షణ కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడలేదని అన్నారు. 2024 కు ముందు జమ్మూ కశ్మీర్ లో నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 12 కాలేజీలకు పెంపు చేశామని, దీని ద్వారా 500 సీట్ల నుంచి 1300 సీట్లకు మెడికల్ సీట్లు పెరిగాయని మోదీ తెలిపారు. జమ్మూ కశ్మీర్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు.

Also Read : దీపాదాస్ మున్షీపై వ్యాఖ్యలకు ఎన్వీఎస్ఎస్ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్ నేతల డిమాండ్

యువశక్తి, నారీ శక్తి, పేదలు, రైతులకు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఉన్నత విద్యకోసం మన విద్యార్థులు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని, పదేళ్లలో ఉన్నత విద్యలో ఉన్నత ప్రమాణాలకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మోదీ చెప్పారు. ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం.. మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుందంటూ మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 ఎంపీ సీట్లు, ఎన్డీయేకు 400 కుపైగా సీట్లే లక్ష్యం అని మోదీ అన్నారు.