PM Modi : కోవిడ్ సమయంలో కేంద్ర-రాష్ట్రాల సమన్వయం భేష్
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ప్రధాని ప్రశంసలు కురించారు.

Modi (2)
PM Modi కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ప్రధాని ప్రశంసలు కురించారు. క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పని చేశాయని మోదీ అన్నారు. కరోనా సమయంలో సృజనాత్మక విధానం రూపకల్పన పేరుతో లింక్‌డ్-ఇన్ బ్లాగ్‌లో రాసిన పోస్ట్‌లో..2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు మరిన్ని రుణాలు సేకరించగలిగాయని తెలిపారు.
23 రాష్ట్రాలు 1.06లక్షల కోట్ల రూపాయలను అదనంగా సేకరించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎంతో వైవిధ్యం గల భారత్ వంటి సమాఖ్య దేశంలో సంస్కరణలను ప్రోత్సహించడంలో రాష్ట్రాలకు జాతీయ స్థాయి విధానపరమైన సాధనాలు లభించడం సవాల్ అని మోదీ తెలిపారు. అయితే దేశ సమాఖ్య వ్యవస్థ మీద విశ్వాసం ఉంచి, కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యం అనే స్ఫూర్తితో ముందుకు సాగినట్లు ప్రధాని తెలిపారు. రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందజేసి ప్రగతిశీల విధానాల ద్వారా అదనపు నిధులు పొందేలా చేసినట్లు తెలిపారు.