పైలట్ ప్రాజెక్టు పూర్తి అయింది : అభినందన్ విడుదలపై మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 05:35 AM IST
పైలట్ ప్రాజెక్టు పూర్తి అయింది : అభినందన్ విడుదలపై మోడీ

Updated On : March 1, 2019 / 5:35 AM IST

పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న భారత పైలట్ విక్రమ్ అభినందన్ శుక్రవారం(మార్చి-1,2019)భారత్ కు చేరుకోనున్నాడు. యావత్ దేశం ఉప్పొంగే మనసుతో ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో గురువారం(ఫిబ్రవరి-28,2019) ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శాంతి ప్రక్రియలో భాగంగా అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు గురువారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు.
Read Also : అభినందన్ ను భారత హైకమిషన్ కు అప్పగించిన పాక్

ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో నిర్వహించిన శాంతి శ్వరూప్ భట్నాగర్ ఫ్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో పాల్గొని ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ సైంటిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ…మీ జీవితాల్ని మీరు లేబరేటరీల్లో గడుపుతారు. మొదట పైలట్ ప్రాజెక్టును తయారుచేయడం సాంప్రదాయం. దాన్ని సామర్థ్యం,సిస్టమ్, అమలు చేసే విధానం తర్వాత జరుగుతుంది.

ఇప్పుడే ఒక పైలట్ ప్రాజెక్ట్ పూర్తి అయింది. ఇప్పుడు మనం దాన్ని నిజం చేయాలి. ఇంతకుముందు అది ప్రాక్టీస్ గానే ఉండేదని అన్నారు. దీంతో ఒక్కసారి అక్కడున్నవారంతా చప్లట్లు కొట్టి అభినందన్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే