హిందువులంటే భయపడే వాళ్లే ఇండియాని చెడగొడతున్నారు-మోడీ

హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్‌ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకతతో పాటు విమర్శలు వస్తున్నాయి.
ప్రసంగంలో మోడీ తెలిపిన మాటలు ఇలా ఉన్నాయి. ‘ఈ దేశం దౌర్భాగ్యం ఏమిటంటే.. ఓమ్, ఆవు ఈ మాటలు విన్న కొందరికీ వెంట్రుకలు నిక్క బొడుచుకుంటున్నాయి. దేశం ఇంకా 16వ శతాబ్దంలో ఉందని వారు అనుకుంటున్నారు. ఇలాంటి తెలివితో ఉన్న వారు తాము చేయాలనుకుందంతా చేస్తున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు.
మోడీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. ప్రధాని ఓ మతగురువులా మాట్లాడుతున్నారు. ముందు మోడీ దేశంలో జీడీపీ వృద్ధి అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విమర్శలకు తావిచ్చేలా మోడీ వ్యాఖ్యలు చేయడం సబబు కాదని లెఫ్టిస్టులు పేర్కొన్నారు.