మమత పంపే రసగుల్లా నాకు ప్రసాదం

బెంగాల్ నుంచి మోడీకి రసగుల్లా పంపిస్తాం కానీ ఓట్లను కాదంటూ ఇటీవల మమతాబెనర్జీ మోడీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.అయితే మమత వ్యాఖ్యలకు మోడీ ఇవాళ(ఏప్రిల్-29,2019)తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వెస్ట్ బెంగాల్ లోని శీరంపూర్ లో మోడీ మాట్లాడుతూ…బెంగాల్ లో తయారైన రసగుల్లాను నాకు ఇవ్వాలనుకుంటున్నట్లు మమత చెప్పింది.రామకృష్ణ పరమహంస,స్వామి వివేకానంద,జేసీ బోస్,నేతాజీ,ఎస్పీ ముఖర్జీ వంటి వాళ్ల సుగంధాన్ని బెంగాల్ మట్టి కలిగి ఉంది.ఈ పవిత్రమైన స్థలంలో తయారైన రసగుల్లా కనుక పొందితే అది తనకు ప్రసాదం అవుతుందని మోడీ అన్నారు.ఈ సందర్భంగా తృణముల్ పై మోడీ తీవ్ర విమర్శలు చేశారు.తృణముల్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.