1987లోనే డిజిటల్ కెమెరా, ఈ-మెయిల్ వాడాను : మోడీ వ్యాఖ్యలపై నెటిజన్లు అవాక్కయ్యారు

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ కెమెరాతో ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • Published By: sreehari ,Published On : May 13, 2019 / 09:13 AM IST
1987లోనే డిజిటల్ కెమెరా, ఈ-మెయిల్ వాడాను : మోడీ వ్యాఖ్యలపై నెటిజన్లు అవాక్కయ్యారు

Updated On : May 13, 2019 / 9:13 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ కెమెరాతో ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ కెమెరాతో ఫొటో తీస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియాను డిజటల్ రంగంపై వైపు నడిపించాలని ఆకాంక్షించిన మోడీ.. డిజిటల్ కెమెరాలపై తన ఆసక్తి ఎలాంటిదో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 1987లోనే మోడీ..ఫస్ట్ టైం డిజిటల్ కెమెరా కొన్నట్టు అప్పటి స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. 1987-88 మధ్యకాలంలోనే డిజిటల్ కెమెరా వాడినట్టు చెప్పారు.

1988 కాలంలోనే తాము ఈ-మెయిల్స్ చాలా తక్కువగా వాడేవాళ్లమని చెప్పుకొచ్చారు. అప్పట్లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో తాను తొలిసారి డిజిటల్ కెమెరా చేతబట్టి కవర్ చేసినట్టు తెలిపారు. తన డిజిటల్ కెమెరాతో అద్వానీ ఫొటో తీసి.. ఈ మెయిల్ ద్వారా పంపినట్టు చెప్పారు. అప్పుడు అది కలర్ ఫొటో ఫ్రింట్ తీసినట్టు గుర్తు. ఆ ఫొటోను అద్వానీకి చూపించగా.. ఆయన ఆశ్చర్యపోయానట్టు మోడీ గుర్తు చేసుకున్నారు. డిజిటల్ కెమెరాతో మోడీ ఫొటో తీస్తున్న ఫొటోను ప్రస్తావిస్తూ.. డిజిటల్ కెమెరాను తొలిసారి వాడింది ప్రధాని మోడేనే అంటూ సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. 

అంతేకాదు.. డిజిటల్ కెమెరా ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయో యూజర్లు ట్విట్టర్ లో ట్వీట్లు పెడుతున్నారు. ఫస్ట్ డిజిటల్ కెమెరా 1987లో నికాన్ నుంచి వచ్చిందని, కమర్షియల్ ఈమెయిల్స్ 1990-95 మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయని యూజర్లు ట్వీట్ చేశారు. డిజిటల్ కెమెరా, ఈమెయిల్ కలిగి ఉంది మొదట పీఎం మోడీనే అంటూ ట్వీట్ చేశారు. 90లోనే మోడీ టచ్ స్ర్కీన్ ప్యాడ్ డివైజ్ వాడారని, 1987లో ఇండియాలో తొలి వ్యక్తి మోడీనే ఉంటారని, డిజిటల్ కెమెరా ద్వారా కలర్ ఫొటో తీసి ఈమెయిల్ ద్వారా అద్వానీ పంపారని యూజర్లు కామెంట్లో తెలిపారు.

1995 నాటి వరకు ఈమెయిల్ సౌకర్యం అందుబాటులో ఉండేవి కావు. కానీ, 1988లో ఇండియాలో అప్పటికే డిజిటల్ కెమెరాను మోడీ వాడారని, ఆ తర్వాత 1995లో అధికారికంగా డిజిటల్ కెమెరా అందుబాటులోకి వచ్చాక మిగతావారంతా  వాడినట్టు ఎకనామిస్ట్ రూప సుబ్రమణ్య తెలిపారు. ప్రధాని మోడీ డిజిటల్ కెమెరా, ఈమెయిల్స్, గట్టర్, మేఘాల నుంచి గ్యాస్ కనిపెట్టారని యూజర్లు ట్వీట్ చేశారు. ఈమెయిల్ సర్వీసు అధికారికంగా లాంచ్ కావడానికి 7ఏళ్ల ముందే వాడేవారని, డిజిటల్ కెమెరాలు ప్రవేశపెట్టానికి 8 ఏళ్లకు ముందే వాడారంటూ యూజర్లు ట్వీట్లు చేశారు.