PM Modi: అప్‌గ్రేడ్ అయిన పీఎం మోదీ కార్.. రూ.12కోట్ల బెంజ్ కారులో హైసెక్యూరిటీ, స్పెషల్ ఫీచర్లు

పీఎం మోదీ కార్ అప్‌గ్రేడ్ అయింది. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్ కు రేంజ్ మార్చారు. తాజాగా Mercedes Benz Maybach S650 కారుకు మారిన మోదీ.. సెక్యూరిటీ రీత్యా ఈ నిర్ణయం...

PM Modi: అప్‌గ్రేడ్ అయిన పీఎం మోదీ కార్.. రూ.12కోట్ల బెంజ్ కారులో హైసెక్యూరిటీ, స్పెషల్ ఫీచర్లు

Pm Modi

Updated On : December 28, 2021 / 11:09 AM IST

PM Modi: పీఎం మోదీ కార్ అప్‌గ్రేడ్ అయింది. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్ కు రేంజ్ మార్చారు. తాజాగా Mercedes Benz Maybach S650 కారుకు మారిన మోదీ.. సెక్యూరిటీ రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల రష్యా అధ్యక్షుడు Putin ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైనే.

రెండు మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా.. ప్రొటెక్ట్ చేయగలదు ఈ కార్. అంతే కాకుండా దీని బాడీ డైరక్ట్ ఎక్స్ ప్లోజన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. గ్యాస్ అటాక్ జరిగితే కారులో సపరేట్ ఎయిర్ సప్లై కూడా అరేంజ్ చేశారు.

6లీటర్ల ట్విన్ టర్బో V12 ఇంజిన్ సాయంతో 516 బీహెచ్‌పీతో 900 Nm పీక్ టార్క్ చేరుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 160కిలోమీటర్లు. దీనికి ఉండే ఫ్లాట్ టైర్లు పంక్చర్ లేదా డ్యామేజి లాంటిది జరిగినా వెంటనే మార్చుకునేందుకు వీలుగా ఉంటంుది. ఇంకా ఈ మేబాచ్ ఎస్ క్లాస్ లో ప్లష్ ఇంటీరియర్ తో పాటు సీట్ మసాజర్స్ కూడా ఉంటాయి. అవసరానికి తగ్గట్లుగా సీట్లను రీ పొజిషన్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: తెలంగాణలో ‘విద్యుత్‌’ షాక్.. పెరగనున్న ఛార్జీలు