ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది : ప్రధాని మోడీ

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 03:36 PM IST
ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగింది : ప్రధాని మోడీ

Updated On : October 2, 2019 / 3:36 PM IST

ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను గౌరవిస్తున్నాయని చెప్పారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. గాంధీ జయంతి వేళ ఆ మహాత్ముడికి ఘన నివాళులర్పించారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ వాడిన వస్తువులు, ఆయన నడియాడిన నేలను సందర్శించారు. దేశానికి మహాత్ముడు చేసిన సేవను గుర్తు చేసుకున్నారాయన. 

సబర్మతి ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీ తన సందేశాన్ని రాశారు. గాంధీ 150వ జయంతి వేళ, ఆయన స్వచ్ఛ భారత్ కల సాకారమైనందుకు నాకు సంతృప్తిగా ఉంది. దేశం బహిరంగ మలవిసర్జన రహితంగా మారిన సమయంలో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ జయంతి వేడుకలకు హాజరవడం నా అదృష్టంగా భావిస్తున్నానని విజిటర్స్ బుక్‌లో రాశారు. 

ఈ సందర్భంగా పీఎం మాట్లాడుతూ పరివర్తనలో సింహభాగం భారత్ దేనని అన్నారు. ప్రధాని హోదాలో తొలిసారి అమెరికా వెళ్లినప్పుడు యోగా గురించి వివరించా.. ఆ తర్వాత యోగా డేను అమెరికా గుర్తించందన్నారు.