Gujarat’s Morbi: మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని సందర్శించిన మోదీ.. వీడియో

కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మోదీ.. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతుండడంతో అక్కడకు వెళ్లి వారిని మోదీ పరామర్శించే అవకాశం ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో ఆ ఆసుపత్రిని అధికారులు శరవేగంగా శుభ్రం చేయించారు.

Gujarat’s Morbi: మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని సందర్శించిన మోదీ.. వీడియో

Updated On : November 1, 2022 / 4:44 PM IST

Gujarat’s Morbi: గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించారు. ఈ ఘటనపై ఆయనకు అధికారులు వివరాలు తెలిపారు. మోదీ వెంట గుజారత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు అధికారులు ఉన్నారు. మచ్చు నదిలో రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.

కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో అధిక శాతం మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతుండడంతో అక్కడకు వెళ్లి వారిని మోదీ పరామర్శించే అవకాశం ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో ఆ ఆసుపత్రిని అధికారులు శరవేగంగా శుభ్రం చేయించారు.

మోదీ నేడు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తారని ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై పలు దేశాల అధినేతలు కూడా సానుభూతి తెలుపుతూ ట్వీట్లు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..