ఆవుని ముద్దు చేసిన మోడీ : జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రారంభం

ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరపదేశ్ లోని మథురలో పర్యటించారు. పలు కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆవు చెవులు పట్టుకుని ఆడించారు. దాన్ని నిమురుతు..ముద్దుగా స్మృశిస్తూ కాసేపు ఉల్లాసంగా గడిపారు. తరువాత ఆవుదూడతో ముచ్చట్లాడారు.దాని చక్కగా నిమురుతూ..గడిపారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని ఇవాళ (సెప్టెంబర్ 11)న మధురలో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. కేంద్రం నిధులతో నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్‌ఎడిసిపి) ను ప్రారంభించారు. పశువుల పాదాలు..నోటి వ్యాధి (ఎఫ్‌ఎండి) మరియు బ్రూసెలోసిస్ నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభంచారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం వాతావరణ మార్పులతో వచ్చిన సమస్యలతో పోరాడుతోందన్నారు. ప్రజలంతా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒక రోల్ మోడల్ కోసం వెతుకుతున్నారనీ..మథురలో శ్రీకృష్ణుడు భారత్‌కు రోల్ మోడల్ గా ఉన్నారన్నారు. పర్యావరణం..పశువులు భారత్ ఆర్థిక వ్యవస్థలో భాగమన్నారు. ప్రకృతిని..ఆర్థిక అభివృద్ధిని సమతుల్యం చేయడం ద్వారా..బలమైన భారత దేశం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
పశువుల్లో వస్తున్న పలు వ్యాధులు నియంత్రణకు కేంద్రం రూ.12,652 కోట్లు కేటాయించిందనీ వాటిని వియోగించి పశువుల్లో వస్తున్న వ్యాధులను నియంత్రణకు వినియోగిస్తామని తెలిపారు. 2030 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులతో సహా 500 మిలియన్ల పశువులకు వ్యాక్సిన్ వేయడానికి ఈ నిధులు ఖర్చు చేయబడతాయన్నారు. పశువుల దూడలకు వచ్చే బ్రూసెలోసిస్ వ్యాధిని నివారించడానికి 36 మిలియన్ బోవిన్ దూడలకు టీకాలు ఇవ్వబడుతాయని తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధానికి అందరూ కృషి చేయాలని ప్రధాని కోరారు.అక్టోబర్ 2 నాటికి మన ఇళ్లల్లో..ఆఫీసుల్లో ..పని ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించటానికి అందరూ కృషి చేయాలని మోడీ సూచించారు. స్వయం సహాక బృందాలకు..సామాన్య పౌరులు అంతా ఈ మిషన్ లో భాగస్వాములు కావాలని కోరారు. మథుర పర్యటనలో భాగంగా పశువుల, పర్యాటక, రహదారి నిర్మాణానికి సంబంధించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 16 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
#WATCH Prime Minister Narendra Modi plays with a cow and its calf in Mathura. pic.twitter.com/SQD84mHcDb
— ANI UP (@ANINewsUP) September 11, 2019