POK పాకిస్తాన్ నియంత్రణలో లేదు : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ 

  • Published By: chvmurthy ,Published On : October 25, 2019 / 04:06 PM IST
POK పాకిస్తాన్ నియంత్రణలో లేదు : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ 

Updated On : October 25, 2019 / 4:06 PM IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్  పాకిస్తాన్  నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని  చెప్పారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. అక్టోబరు 25న ఆర్మీ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ POK అనేది ఉగ్రవాదులు నియంత్రిస్తున్న ఒక భూభాగం మాత్రమేనని వివరించారు.

గిల్గిట్, బాల్టిస్థాన్, పీవోకే మొత్తం కలిపి జమ్మూకశ్మీర్ రాష్ట్రం అనీ…ఆ రెండు ప్రాంతాలను పొరుగు దేశం అక్రమంగా కబ్జా చేసిందని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక ప్రావిజన్ మాత్రమేనని  రావత్ అన్నారు. దాన్ని తీసుకొచ్చినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు  చెప్పని పాకిస్తాన్ దాన్ని తొలగించినప్పుడు మాత్రం నానా యాగీ చేస్తోందన్నారు.
జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితిని దెబ్బతీసేందుకు పాకిస్థాన్ చాలా ప్రయత్నాలు చేస్తోందని రావత్ చెప్పారు. 

అమెరికాకు చెందిన సిగ్ సావ‌ర్ రైఫిళ్లు ప్రపంచంలోనే అత్యుత్త‌మ‌మైన‌వ‌ని, వాటిని ఈ ఏడాది చివ‌రి క‌ల్లా భార‌త ఇన్‌ఫాంట‌రీ ద‌ళాల‌కు  అంద చేస్తామని  రావ‌త్ స్ప‌ష్టం చేశారు.