Case On Reporter: వాట్సాప్ స్టేటస్‌.. రిపోర్టర్‌పై కేసు

2006 లో జమ్మూకాశ్మీర్ లోని ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన జరిగి 15 ఏళ్లు నిండాయి.

Case On Reporter: వాట్సాప్ స్టేటస్‌.. రిపోర్టర్‌పై కేసు

Case On Reporter

Updated On : June 8, 2021 / 2:18 PM IST

Case On Reporter: 2006 లో జమ్మూకాశ్మీర్ లోని ఉలాకర్ సరస్సులో ఓ బోటు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది స్కూల్ చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన జరిగి 15 ఏళ్లు నిండాయి. ఈ దుర్ఘటనను గుర్తు చేస్తూ బందీపురా జిల్లాకు చెందిన సాజిద్ రైనా అనే రిపోర్టర్ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. అయితే ఇది వివాదాస్పదంగా ఉండటంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై పోలీసులు స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా స్టేటస్ ఉందని పోలీసులు పేర్కొన్నారు.

కాగా తనపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని సాజిద్ పోలీసులను కోరారు. పోలీసులు దానిని తిరస్కరించారు. 23 ఏళ్ల యువ రిపోర్టర్ సాజిద్ పై నమోదు చేసిన కేసును పోలీసులు సమర్ధించారు. రిపోర్టర్‌ అనే కోణంలో కేసు నమోదు చెయ్యలేదని స్టేటస్ కాంటెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.