మహారాష్ట్ర,హర్యానాలో కమలం జోరు

మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 269,హర్యానాలో 90కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తోంది. కమలం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 193కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ 87స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. హర్యానాలో మొత్తం 90 స్థానాలకు గాను 58 స్థానాల్లో ఇప్పటివరకు బీజేపీ ముందంజలో ఉండగా కాంగ్రెస్ కేవలం 29 స్థానాల్లో ముందంజలో ఉంది. రెండు రాష్ట్రాల్లోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
నాగ్ పూర్ లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ ముందంజలో ఉన్నారు. బారామతిలో ఎన్సీసీ నాయకుడు అజిత్ పవార్ ముందంజలో ఉన్నారు. వర్లి నియోజవర్గంలో శివసేన చీఫ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా 51అసెంబ్లీ,2లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. సాయంత్రంలోపు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.