నాకు విడుదల : శశికళ రిలీజ్ కు అవకాశాలు

బెంగళూరు : దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ, త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం..స్వల్ప కాల శిక్షకు గురైన వారు మూడోవంతు శిక్షను పూర్తి చేసుకున్న అనంతరం ఎప్పుడైనా విడుదల కావచ్చు. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ఖరారు కాగా ఆమె ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్ర చట్టాల ప్రకారం సత్ప్రవర్తనతో శశికళ జైలు శిక్షాకాలం పూర్తవ్వకుండానే ఆమె బైటపడే వస్తారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఆమెకు జైలుశిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు ఖరారు చేసిన క్రమంలో ఆ జరిమానా డబ్బును శశికళ ఇంతవరకూ కట్టకపోవటం గమనించాల్సిన విషయం. జరిమానా డబ్బు కోసం ఆమె ఆస్తులను జప్తు చేసేందుకు తమిళనాడు సర్కారు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని గడుపుతున్న ఇళవరసి, సుధాకరన్ లు కూడా మూడేళ్ల శిక్షాకాలం పూర్తి కాగానే విడుదలవుతారని సమాచారం.