‘Power Is Not Free’..Minister Warn : ‘ఇప్పటికైనా..బిల్లులు కట్టండి..లేకుంటే..కరెంట్ కట్’ : మంత్రి వార్నింగ్

ఇప్పటికైనా..బిల్లులు కట్టండి..లేకుంటే..కరెంట్ కట్ చేస్తాం’అని విద్యుత్ శాఖా మంత్రి వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చారు.

‘Power Is Not Free’..Minister Warn : ‘ఇప్పటికైనా..బిల్లులు కట్టండి..లేకుంటే..కరెంట్ కట్’ : మంత్రి వార్నింగ్

'power Is Not Free'..minister Warn

Updated On : February 28, 2022 / 5:48 PM IST

Maharashtra Minister Nitin Raut Warn To Cut Supply to Defaulters : కరెంట్ బిల్లులు (power bills)వెంటనే కట్టండీ లేకుంటే సరఫరా కట్ చేస్తాం అంటూ మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ (Minister Nitin Raut Warn) హెచ్చరించారు. ఇళ్లల్లోకి విద్యుత్ ఉచితంగా రాదని గుర్తుంచుకోవాలని చురకలు వేశారు. బిల్లు చెల్లించకపోతే కరెంట్‌ను నిలిపి వేస్తామని అకోలాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వినియోగదారులను హెచ్చరించారు. కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించినా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించారని..ఆ సమయంలో వారు కోవిడ్ కు గురి అయ్యి ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తు చేశారు మంత్రి. ప్రజలు ఇళ్లలోనే ఉన్నప్పుడు కూడా విద్యుత్ పంపిణీకి ఏమాత్రం అంతరాయం కలుగకుండా ఉద్యోగులు పనిచేశారని మంత్రి నితిన్ రౌత్ తెలిపారు. కానీ చాలామంది కరెంట్ బిల్లులను చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిల్లులు చెల్లించకపోతే పవర్ సప్లై (power Cut)ను నిలిపివేస్తామని రౌత్ కాబట్టి బకాయిల దారులు వెంటనే బిల్లులు చెల్లించాలని హెచ్చరించారు. విద్యుత్ ఉచితంగా రావడం లేదని, బిల్లులు చెల్లించని వారిని క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రిగారు. “లాక్‌డౌన్ సమయంలో మీరు ఇళ్లల్లో కూర్చున్నప్పుడు చాలామంది రాత్రి, పగలు పనిచేశారు. ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు ఉపయోగించుకోవడానికి 24 గంటలు కరెంట్ సప్లై చేశారు. దానికోసం కొంతమంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. అని మంత్రి రౌత్ అన్నారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించి విద్యుత్ ఉద్యోగులను కాపాడుకోవాలని మంత్రి సూచించారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించకపోతే కరెంట్‌ను నిలిపివేస్తామంటూ ఆయన పదే పదే సూచించారు.

కాగా..మహారాష్ట్రంలో విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వాడిన దానికంటే ఎక్కువగా విద్యుత్ బిల్లులు వచ్చాయని ఆరోపిస్తున్నారు రైతులు. ఇటువంటి సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.